ఇంధన భారం

- వ్యవసాయంపై డీజిల్ మంట
- రోజురోజుకూ పెరుగుతున్న ధరలు
- సాగు యంత్రాల వాడకంపై ప్రభావం
- గతేడాది కంటే రెట్టింపైన పెట్టుబడి
- జిల్లా రైతాంగంపై సుమారురూ. 93.86 కోట్ల భారం
- వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు వచ్చాయి. యంత్ర పరికరాలు
- లేనిదే పంటలు పండించలేని పరిస్థితి.
దుక్కి దున్నినప్పటి నుంచి నూర్పిడి వరకు ట్రాక్టర్, హార్వెస్టర్, పురుగుల మందుల పిచికారీ తదితర యంత్రాల అవసరం ఎంతో ఉంది. కానీ వాటికి వాడే ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతుండడం వల్ల రైతులపై అదనపు భారం పడుతున్నది. ఇదేగాక పరోక్షంగా విద్యుత్ పరికరాలు, మోటర్లు, పైపులపై కూడా ఖర్చు ఎక్కువైంది. పెరిగిన ధరలతో ఈ యాసంగిలో నల్లగొండ జిల్లా రైతాంగంపై రూ. 53.31 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ. 40.55 కోట్ల భారం పడనుంది.
15 రోజుల్లో రూ.4.91 పైసల పెంపు
పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో చమురు సంస్థలు ఇష్టారీతిన ధరలు పెంచుతున్నాయి. ప్రతిరోజూ కొన్ని పైసల చొప్పున ధర పెరుగుతున్నది. లీటర్ డీజిల్ ధర 15 రోజుల్లోనే రూ.4.91 పెరిగింది. గతేడాది డిసెంబర్లో లీటరు డీజిల్ రూ.74.40 ఉండగా ఇప్పుడు రూ. 80.57కి చేరింది.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాగు యంత్రాల అద్దెపై ప్రభావం
గతేడాదితో పోలిస్తే రెట్టింపైన పెట్టుబడి వ్యయం
జిల్లా రైతాంగంపై రూ.93.86కోట్ల భారం
20గుంటల భూమిలో 17రకాల కూరగాయలు పండించడమే గాకుండా మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఎలాంటి రసాయనిక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో దిగుబడి పెంచుతూ ఆదాయం పొందుతున్నాడు.. తుంగతుర్తి మండలం సంగెం గ్రామరైతు నల్లు లక్ష్మీనరసింహారెడ్డి. ఏడు పదుల వయసులోనూ ఓ పక్క వ్యవసాయంలో మరో పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో ప్రత్యామ్నాయ పంటగా కూరగాయల సాగుపై దృష్టి సారించాడు. తన ఇంటి ఎదుట 20గుంటల వ్యవసాయ క్షేత్రాన్ని అక్టోబర్ నెల మొదటి వారంలో చిన్న చిన్న మడులుగా చేశాడు. మల్చింగ్ పద్ధతిలో విత్తనాలు వేసి పందిరి సాగుతో కూరగాయలు సాగు చేస్తున్నాడు.
యంత్రాలదే కీలకం...
వ్యవసాయ రంగంలో సుమారు దశాబ్ద కాలంగా యంత్రాల వినియోగం పెరుగుతున్నది. యంత్ర పరికరాలు లేనిదే పంటలు పండించలేని పరిస్థితి దాదాపు వచ్చింది. వ్యవసాయంపై ప్రభుత్వం, రైతాంగం శ్రద్ధ చూపుతున్నది. దీంతో యంత్రాల వినియోగం కీలకమైంది. దుక్కి దున్నినప్పటి నుంచి పంట నూర్పిడి వరకు యంత్రాలు లేకుండా ఏ పనీ జరగడం లేదు. అయితే ఇవి నడవడానికి ఇంధనం తప్పనిసరి కావడం, డీజిల్ ధరలు నిత్యం పెరుగుతుండడంతో యంత్రాల యజమానులు సీజన్‌కోసారి ధరలు పెంచుతున్నారు. చమురు సంస్థలు ఇంధన ధరలు క్రమం తప్పకుండా పెంచుతున్నాయి. పైసల్లో ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులకు పెద్దగా తెలియడం లేదు. కానీ పదిపదిహేను రోజుల్లో డీజిల్ ధర లీటర్‌పై కనీసం రూ.4.71వరకు పెరిగింది. ప్రస్తుతం లీటర్ ధర రూ.80పైగానే ఉన్నది. ధరల పెరుగుదలతో ట్రాక్టర్, వరి కోసే యంత్రాలు, పురుగుల మందుల పిచికారీ చేసే యంత్ర పరికరాల కిరాయిలు కూడా పెరుగుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల విద్యుత్ పరికరాలు, మోటర్లు, పైపుల ధరలు సైతం భారంగా పరిణమించాయి.
ఎకరానికి డీజిల్ ఖర్చు రూ.1933.68..
యాసంగిలో నల్లగొండ జిల్లాలో 4,32,090ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 3,70,000ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో డీజిల్ ధరల భారం రైతులపై పడనున్నది. నారుమడి దున్నేందుకు మూడు లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. ఎకరం భూమి ఇరువాలు దమ్ముకు ఆరు లీటర్లు, ఎగసాలు దమ్ముకు ఆరు లీటర్లు, కరిగట్టు దమ్ముకు ఆరు లీటర్లు, గొర్రు తోలేందుకు మూడు లీటర్లు, నాటు పూర్తయ్యే వరకు మొత్తం 24లీటర్ల డీజిల్ రూ.1933.68 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కిరాయి పెంచుతున్నారు...
రెండేళ్ల కిందట ట్రాక్టర్ కిరాయి గంటకు రూ.1200తీసుకునేటోళ్లు. ఇప్పుడు డీజిల్ ధర పెరిగిందని రూ.1800తీసుకుంటున్నారు. ఐదెకరాలను దున్నడానికి రూ.10వేల వరకు ఖర్చవుతోంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
- కడియాల సత్యనారాయణ, లింగగిరి, హుజూర్నగర్ మండలం
ఏటా పెట్టుబడి పెరుగుతుంది...
లింగగిరి గ్రామానికి చెందిన సైదులు తొమ్మిది ఎకరాల్లో ఈ యాసంగిలో వరిసాగుకు సన్నద్ధమయ్యాడు. యంత్రాల అద్దె ఏటా రూ.1.60లక్షల నుంచి రూ.1.90లక్షల వరకు చెల్లించేవాడు. పెరిగిన ఇంధన ధరలతో ఆ ఖర్చు ఇప్పుడు రూ.2.50లక్షల వరకు చేరిందని ఆవేదన చెందుతున్నాడు.
- బొలిశెట్టి సైదులు, రామచంద్రాపురం, గరిడేపల్లి
సేంద్రియ విధానంతో పంట దిగుబడి...
పశువుల మూత్రాన్ని వర్మీ కంపోస్టు, వర్మీ వాచ్ పద్ధతిలో తయారు చేసి డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. బలంతో పాటు తెగుళ్ల నివారణకు డీనోమిక కంపోస్టును 200లీటర్లు కలిపి డ్రిప్ ద్వారా కూరగాయల మొక్కలకు సరఫరా చేస్తున్నారు. తెగుళ్లకు ప్రత్యేకంగా వేపనూనె, గానుగ, ఆముదం నూనె పిచికారీ చేస్తున్నారు. ప్రస్తుతం తన వ్యవసాయ క్షేత్రంలో చెర్రీ టమాట, సొర, బీర, వంకాయ, గోరుచిక్కుడు, కీర దోస, కర్బూజ, బెండకాయ, పాలకూర, కొత్తిమీర, పుదీన, బంతిపూలతో పాటు మొత్తం 17రకాల కూరగాయలను రెండు లక్షల వ్యయం పెట్టుబడిలో ప్రారంభించినట్లు తెలిపారు. 60రోజులకు ఆశించిన దిగుబడి వచ్చిందని తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు క్షేత్రం వద్దకు వచ్చి మేలు రకాలైన కూరగాయలను తీసుకుంటున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సూర్యాపేట జిల్లాలో ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయించి, నాబార్డు సహకారంతో ప్రతి రైతు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేసుకునేందుకు సబ్సిడీపై రుణాలు మంజూరు మంజూరు చేయించాలని కోరుతున్నారు.
రైతులు సేంద్రియ సేద్యం దిశగా మొగ్గు చూపాలి...
- 20గుంటల్లో 17పంటలు
- సేంద్రియ సేద్యంలో రాణిస్తున్న రైతు లక్ష్మీనరసింహారెడ్డి
- మెరుగైన ఆదాయం, పలువురికి ఉపాధి
ప్రతి రైతు వ్యవసాయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి పొందే మార్గాలను అనుసరించాలి. సేంద్రియ పద్ధతిలో 5నుంచి 10గుంటల్లో తప్పని సరిగా కూరగాయల సాగు వైపు దృష్టిని మళ్లిస్తే చాలు.. పలువురికి ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా లబ్ధి పొందుతారు.
- నల్లు లక్ష్మీనరసింహారెడ్డి, రైతు, సంగెం