సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Dec 27, 2020 , 00:30:29

నర్సింహయ్య సంతాప సభను విజయవంతం చేయాలి

నర్సింహయ్య సంతాప సభను విజయవంతం చేయాలి

హాలియా : నల్లగొండలో యాదవ సం ఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే దివంగత ఎమ్మెల్యే  నోముల సంతాప సభను విజయవంతం చేసేందుకు పార్టీలకు అతీతంగా తరలిరావాలని యాదవ సంఘం నాయకులు జవ్వాజి వెంకటేశ్వర్లు, మండలి రవికుమార్‌ కోరారు. శనివారం వారు  విలేకరులతో మాట్లాడుతూ నోముల మరణించి నెల రోజులు కావస్తున్నందున ఆ మహానాయకుడిని మరోసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యాదవ సంఘం నాయకులు కట్టెబోయిన గోవర్ధన్‌,  అశోక్‌, రాంఅంజయ్య, సర్పంచులు రావుల శ్రీను, సైదులు,   సతీశ్‌, మన్నెం వెంకటేశ్వర్లు, మహేశ్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

యాదవులు తరలిరావాలి

మాడ్గులపల్లి : నల్లగొండలో జరిగే నోముల నర్సింహయ్య సంతాప సభను జయప్రదం చేయాలని గొర్రెల పెంపకం దారుల మిర్యాలగూడ డివిజన్‌ అధ్యక్షుడు  ఊరిబిండి శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన  మా ట్లాడారు. కొండయ్య యాదవ్‌, సైదులు యాదవ్‌, ఆవుల సైదులు యాదవ్‌, నాగరాజు యాదవ్‌, నాగరాజు పాల్గొన్నారు.

పెద్దఅడిశర్లపల్లి : నోముల సంతాప సభకు మండలం నుంచి యాదవులు పెద్దసంఖ్యలో తరలిరావాలని యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముచ్చర్ల ఏడుకొండల్‌ యాదవ్‌ కోరారు.


VIDEOS

logo