మంగళవారం 02 మార్చి 2021
Nalgonda - Dec 27, 2020 , 00:30:29

అందుబాటులో ఉంటా.. సమస్యలు పరిష్కరిస్తా..

అందుబాటులో ఉంటా.. సమస్యలు పరిష్కరిస్తా..

  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నోముల భగత్‌ 

హాలియా : నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన తండ్రి ఆశయ సాధన కోసం పని చేస్తానని దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నోముల భగత్‌ అన్నారు. శనివారం హాలియా విశ్రాంతి ఉద్యోగుల భవనంలో నాగార్జున సాగర్‌ ముస్లిం మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో నోముల సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు. నియోజకవర్గంలోని ముస్లింల సమస్యలను తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. షేక్‌ అబ్బాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంపత్‌కుమార్‌,  ముస్లిం నాయకులు షేక్‌ బషీర్‌, షేక్‌ వహీద్‌, అన్వరుద్దీన్‌, సయ్యద్‌, మదార్‌షా, సుబానీ, జానీ, హైమద్‌ అలీ, అక్బర్‌, షేక్‌ మున్నా, సమీరాఅన్వర్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo