సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Dec 27, 2020 , 00:30:31

నేడు నోముల సంతాప సభ

నేడు నోముల సంతాప సభ

  • నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటలకు..
  • ఉమ్మడి జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు

నల్లగొండ : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సంతాప సభ ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభ మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనుంది. సభ ఏర్పాట్లను ఇప్పటికే యాదవ సంఘం నాయకులు పూర్తి చేశారు. సభకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్‌, జైపాల్‌ యాదవ్‌, అంజయ్య, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం చైర్మన్‌ రాజయ్య, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబూరావు, జాతీయ కార్యదర్శి లక్ష్మణ్‌ తదితరులు హాజరుకానున్నారని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లోడంగి గోవర్ధన్‌ తెలిపారు. 

సభను విజయవంతం చేయాలి : కుల సంఘాలు

నోముల సంతాప సభను విజయవంతం చేయాలని శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు నల్లగొండలోని యాదవ సంఘం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరారు. సమావేశంలో ఆయా సంఘాల నేతలు దుడుకు లక్ష్మీనారాయణ, మారపాక నరేందర్‌, కోనేటి నర్సింహ, పంకజ్‌ యాదవ్‌, తరాల పరమేశ్‌, మామిడి పద్మ, గోపాలకృష్ణ, గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

తాజావార్తలు


logo