శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Dec 24, 2020 , 00:57:24

సహకార రంగంపై అవగాహన ఉండాలి

సహకార రంగంపై అవగాహన ఉండాలి

డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

నల్లగొండ: ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు సహకార రంగంపై పూర్తి  అవగాహన కలిగి ఉండాలని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి సూచించారు. డీసీసీబీ కార్యాలయంలో బుధవారం నల్లగొండ జిల్లా పీఏసీఎస్‌ చైర్మన్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. పీఏసీఎస్‌లు బాగుంటేనే డీసీసీబీలు, టెస్కాబ్‌ బాగుంటాయని అన్నారు. టెస్కాబ్‌ సహకారంతో పీఏసీఎస్‌లకు అధిక నిధులు కేటాయించి  బలో పేతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులకు కావాల్సిన రుణాలు ఇవ్వడంతో పాటు ఆర్థ్దికంగా ఆయా పీఏసీఎస్‌ అభివృద్ధ్దికి చైర్మన్లు, సీఈఓలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, డీసీఓ శ్రీనివాస మూర్తి, డీసీసీబీ సీఈఓ మదన్‌మోహన్‌, డైరెక్టర్లు కోడి సుష్మ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo