శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nalgonda - Dec 23, 2020 , 01:52:29

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

  • డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి
  • దామరచర్ల, త్రిపురారం మండలాల్లో క్రైస్తవులకు దుస్తుల పంపిణీ

దామరచర్ల : సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం కృషిచేస్తున్నదని డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి అన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా మండల కేంద్రంలోని చర్చిలో మంగళవారం దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 120 మంది క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ రమావత్‌ నందిని, వైస్‌ ఎంపీపీ సైదులురెడ్డి, తాసీల్దార్‌ జీవీఎన్‌ రాజు, సర్పంచ్‌ బంటు కిరణ్‌, ఎంపీటీసీ సోము సైదిరెడ్డి, వీర సైదులు చర్చి పాస్టర్లు పాల్గొన్నారు.  

క్రైస్తవులకు దుస్తుల పంపిణీ

త్రిపురారం: మండలకేంద్రంలోని తాసీల్దార్‌ కార్యాలయంలో క్రిస్టియన్లకు ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాసరెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భారతీ భాస్కర్‌నాయక్‌, తాసీల్దార్‌ కేసీ.ప్రమీల, సర్పంచ్‌ అనుముల శ్రీనివాసరెడ్డి, క్రిస్టియన్లు పాల్గొన్నారు.

VIDEOS

logo