సోమవారం 08 మార్చి 2021
Nalgonda - Dec 22, 2020 , 00:16:15

చైతన్య దీపికఎన్‌జీ కాలేజీ

చైతన్య దీపికఎన్‌జీ కాలేజీ

  • ఎందరో మేధావులను అందించిన కళాశాల
  • అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దుతాం 
  • భవనాల శంకుస్థాపనలో మంత్రి జగదీశ్‌రెడ్డి
  • సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, వేదికపై ఎంపీ బడుగుల లింగయ్య, జడ్పీచైర్మన్‌ 
  • బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్‌ పీజే పాటిల్‌

విద్యా వెలుగులు ప్రజ్వలించేలా నాగార్జున ప్రభుత్వ కళాశాలను అభివృద్ధి చేస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రూ.6.20కోట్లతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు సోమవారం ఆయన భూమి పూజ చేశారు. అంతకుముందు ఎన్‌సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎందరో మేధావులు, అధికారులు, సామాజిక కార్యకర్తలను ఎన్జీ కాలేజీ తెలంగాణకు అందించిందన్నారు. నల్లగొండ జిల్లా చైతన్యానికి ప్రతీక ఎన్జీ కాలేజీ అని కొనియాడారు. విద్యార్థులు చదువుతోపాటు ప్రశ్నించేతత్వాన్ని, జ్ఞానాన్ని పెంపొందించు కోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ విద్యావిభాగం : చైతన్య దీపిక ఎన్జీ కళాశాల అని  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన  ఎన్జీ కళాశాలలో  నూతన తరగతి గదుల నిర్మాణానికి ఆయన సోమవారం శంకుస్థాపన, భూమి పూజ చేశారు.  అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి మాట్లాడారు.  ఇక్కడి ఉద్యమాలు రాష్ట్రంలో జరిగిన ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు జీవితాన్ని నేర్చుకోవాలని సూచించారు. ఎన్జీ కళాశాలను మరింత అభివృద్ధి చేసేలా అత్యంత ఆధునిక వసతులతో నూతన భవనాలు ఏర్పాటు చేసి ఉత్తమ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ 1955లో నిర్మాణమైన ఎన్జీ కళాశాలకు ఎంతో చరిత్ర ఉందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో తెలంగాణ కాలేజ్‌ ఎట్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ నుంచి నిధులు విడుదల చేయించారని తెలిపారు. వీటితో 30గదులతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలోనే 5,500 మంది విద్యార్థులకు విద్య నందిస్తున్న కళాశాల కావడం గర్వంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఎన్జీ కళాశాలకు నూతన భవనాలు నిర్మించడం సంతోషకరమని, తానూ ఎన్జీ కళాశాల పూర్వ విద్యార్థినేనని గుర్తుచేశారు. విద్య, వైద్యం ప్రభుత్వ రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.   ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌,  జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేశ్‌గౌడ్‌, విశ్రాంత ఐఏఎస్‌ చొల్లేటి ప్రభాకర్‌, బీఆర్‌ఏఓయూ  డీడీ బి.ధర్మానాయక్‌, ఎన్జీ, ఉమెన్స్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ రహత్‌ఖానం, డాక్టర్‌ ఘన్‌శ్యాం, ఎంజీయూ మాజీ రిజిస్ట్రార్‌ ప్రొ.కె.నరేందర్‌రెడ్డి, ఎన్జీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గుండెబోయిన లింగయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్‌కుమార్‌, కౌన్సిలర్లు మహ్మద్‌  ఖయ్యూమ్‌బేగ్‌, పిల్లి రామరాజు, అభిమన్యు శ్రీనివాస్‌, బండారు ప్రసాద్‌, టీఎస్‌ఈడబ్ల్యూ ఐడీసీ కార్యనిర్వాహక ఇంజినీర్‌ అనితాసింగ్‌నాథ్‌, ఎన్జీ కళాశాల అధ్యాపకులు, ప్రముఖులు  పాల్గొన్నారు.

బీఆర్‌ఏఓయూకు ఐఎస్‌ఓ గుర్తింపు  

నల్లగొండ విద్యావిభాగం : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రీజినల్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌కు గౌరవం దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలోనే పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఉత్తమ సేవలు అందిస్తూ విద్యలో ముందుకు వెళ్తున్నందుకు ఐఎస్‌ఓ(ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండరైజేషన్‌)గుర్తింపు పొందింది. సోమవారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన సదస్సులో విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చేతుల మీదుగా ఆ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ అందించిన ఫలాలు పేదలకు చేరేలా నల్లగొండ రీజినల్‌ సెంటర్‌ కృషి చేయడం అభినందనీయమన్నారు. యూనివర్సిటీ డీడీ డా॥ బి.ధర్మానాయక్‌ మాట్లాడుతూ దూరవిద్యలో దేశంలోనే ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ నల్లగొండకే దక్కిందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక అడ్మిషన్లు కలిగి ఉన్నట్లు తెలిపారు. తాము అందిస్తున్న సేవలను గుర్తించి సర్టిఫికెట్‌ అందజేయడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా బీఆర్‌ఏఓయూ తరగతుల నిర్వహణకు నూతన గదులు నిర్మించాలని కోరుతూ మంత్రి, ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేయగా రూ.1.5 కోట్లు మంజూరు చేస్తామని వెల్లడించినట్లు ధర్మానాయక్‌ తెలిపారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ఐఎస్‌ఓ అధికారి శివయ్య, ఎంజీయూ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అల్వాల రవి, ఎంజీయూ మాజీ రిజిస్ట్రార్‌ ప్రొ.కె.నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo