పిల్లల చదువుపై శ్రద్ధ చూపాలి

- గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- చిట్యాలలో ‘యురేకా’ కార్యక్రమం
చిట్యాల : విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని, పిల్లలు చిన్నప్పటి నుంచే జ్ఞాన పోరాటం చేసేలా చూడటం ద్వారా జ్ఞాన సమాజాన్ని నిర్మించాలని గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఆదివారం చిట్యాలలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణలో టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యురేకా కార్యక్రమం(మన ఊరికే మన గురుకులం)లో ఆయన పాల్గొని మాట్లాడారు. గురుకులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విలేజ్ లెర్నింగ్ సెంటర్లకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తాము చదువుకోలేదని బాధపడొద్దని, గురుకులాల ద్వారా తమ పిల్లలకు మంచి చదువు, భవిష్యత్ ఇప్పించవచ్చని వివరించారు. గురుకులాల్లో చదివిన విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలకు గురుకులాల్లో మంచి చదువు లభిస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి మాట్లాడుతూ చిట్యాల మండలానికి గురుకులాన్ని మంజూరు చేయాలని కోరారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్‌ఫెయిర్, మోడల్ పార్లమెంట్‌ను ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నార్కట్‌పల్లి తాసీల్దార్ రాధ, పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు బాల్‌రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ పోలేపల్లి సత్యనారాయణ, తిప్పర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గాదె లింగస్వామి, ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మేడి రమేశ్, రుద్రవరం యాదయ్య, పోకల దేవదాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!