శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Dec 21, 2020 , 00:09:25

పల్లె పార్కులు

పల్లె పార్కులు

  • మండల అధికారులు, 
  • ప్రజాప్రతినిధులను 
  • అభినందించిన కలెక్టర్‌
  • చిట్యాల మండలంలోని 
  • ప్రకృతి వనాలకు ప్రత్యేక గుర్తింపు
  • ఒకప్పుడు పట్టణాలకే 

పరిమితమైన పార్కులు ఇప్పుడు పల్లెల్లోనూ ఏర్పాటవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాలను పచ్చదనంగా, ఆహ్లాదంగా మార్చేందుకు పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. స్థలం చిన్నదే అయినా.. అచ్చం పట్టణాల్లోని పార్కుల మాదిరిగానే రకరకాల మొక్కలను ఏర్పాటు చేస్తుండడంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి వనాల్లో నడవడానికి వాకింగ్‌ ట్రాక్‌, కొన్ని గ్రామాల్లో కూర్చోవడానికి బెంచీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో గ్రామాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి.అయితే.. ప్రకృతి వనాల్లో పెద్దలకు వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసినట్లుగానే యువతకు జిమ్‌, పిల్లలకు చిన్న చిన్న ఆట వస్తువులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు పేర్కొంటున్నారు. పిల్లలు ఆడుకోవడానికి అసరమైన ఉయ్యాల, జారుడు బండ, బ్యాలెన్సింగ్‌ బెంచీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.చిట్యాల మండలంలో అధికారుల ప్రత్యేక చొరవ, సర్పంచుల కృషితో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు జిల్లాలోనే ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ప్రభుత్వ సంకల్పానికి తోడు సర్పంచులు, అధికారులు ప్రత్యేక చొరవతో ఎక్కువ నిధులతో ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి వనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6 లక్షలు కేటాయించగా.. మరో రెండు, మూడు లక్షల రూపాయలను గ్రీన్‌ ప్లాన్‌ నుంచి తీసుకొని అందంగా ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీలు, 5 ఆవాస గ్రామాల్లో మొత్తం 23 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిల్లో 60,500 మొక్కలను నాటారు. కొన్ని గ్రామాల్లో ఆంధ్రా నుంచి ప్రత్యేకంగా తెప్పించి నాటించారు. మండలంలో ఏర్పాటవుతున్న ప్రకృతి వనాల పట్ల కలెక్టర్‌ పీజే పాటిల్‌ పలు సందర్భాల్లో సంతృప్తి వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

ఆహ్లాదాన్ని పంచుతుంది 

ప్రకృతి వనాలు పల్లె ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతాయి. పిల్లలకు, పెద్దలకు పార్కుల మాదిరిగా కాలక్షేపం కలిగిస్తాయి. ఇండ్ల వద్ద ఉండే గామీణ ప్రజలు ఈ వనాల్లో సేద తీరడానికి అవకాశం ఉంటుంది. 

పల్లెలకు కొత్త అందాలు తెస్తున్నాయి 

ప్రకృతి వనాలు పల్లెలకు కొత్త అందాన్ని ఇస్తున్నాయి. గ్రామాల అభివృద్ధి కోసం గతంలో చేపట్టిన పనులకు భిన్నంగా ఇవి ప్రత్యేక గుర్తింపు తెస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన ఈ పథకంతో ప్రతి గ్రామంలో ఓ వనం పెరుగుతుంది.

- పాలెం మాధవి, ఏపూరు సర్పంచ్‌

VIDEOS

logo