బుధవారం 24 ఫిబ్రవరి 2021
Nalgonda - Dec 20, 2020 , 00:48:22

ప్లీజ్‌.. న్యాయం చేయండి

ప్లీజ్‌.. న్యాయం చేయండి

  • ఎమ్మెల్యే కంచర్లకు ఎంజీయూ విద్యార్థుల వినతి

నల్లగొండ విద్యావిభాగం: ఎంజీయూ నిర్వహించిన పరీక్షల్లో తమను అన్యాయంగా ఫెయిల్‌ చేశారని, మీరే మాకు న్యాయం చేయాలని శనివారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని విద్యార్థులు వేడుకున్నారు. ఈమేరకు నల్లగొండలో ఆయన్ని కలిసి వినతిపత్రం అందించారు. ఆరో సెమిస్టర్‌లో ఒక్క సబ్జెక్టులో ఫెయిల్‌ చేశారని అయితే రూ.1000 చెల్లించి జవాబు పత్రం జిరాక్స్‌ తీసుకుని చూస్తే వాటిలో కొన్ని జవాబులకు వాల్యుయేషన్‌ చేయలేదని తెలిపారు. అదేవిధంగా రీవాల్యుయేషన్‌ సైతం పెట్టుకున్నామని.. దీనిపై అడగడానికి వెళ్తే రిజిస్ట్రార్‌, సీఓఈలు దాటవేసే ధోరణితో వ్యహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పీజీ సెట్‌ సైతం రాశామని తమకు న్యాయం జరిగేలా చూసి పైచదువులు చదువుకునేందుకు సహకరించాలని కోరారు. వారి వెంట ఎంజీయూ పరిరక్షణ సమితి బాధ్యుడు పందుల సైదులు ఉన్నారు.

VIDEOS

logo