శుక్రవారం 05 మార్చి 2021
Nalgonda - Dec 19, 2020 , 01:18:06

నకిరేకల్‌ను మోడల్‌ సిటీ చేయడమే లక్ష్యం

నకిరేకల్‌ను మోడల్‌ సిటీ చేయడమే లక్ష్యం

  • ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

కట్టంగూర్‌(నకిరేకల్‌) : మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి సహకారంతో రూ.3.5 కోట్ల నిధులు తీసుకొచ్చి నకిరేకల్‌ను రాష్ట్రంలోనే మోడల్‌ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్‌ పట్టణంలోని 5, 9వ వార్డుల్లో ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలో శిథిలావస్థలో ఉన్న మసీదు, షాదీఖానాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్‌ పట్టణ సమగ్రాభివృద్ధితోపాటు పేదల సంక్షేమమే ధ్యేయమన్నారు. పట్టణంలో మసీదు, షాదీఖానా శిథిలావస్థకు చేరాయని, వాటి మరమ్మతుల కోసం మంత్రి సహకారంతో రూ.15 లక్షలతో ప్రహారీ నిర్మించి మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. 35వేల జనాభా కలిగిన నకిరేకల్‌ పట్టణంలో కడపర్తి, మూసీ రోడ్డు, పన్నాలగూడెం, పోలీస్‌స్టేషన్‌ నుంచి సాయిబాబా ఆలయం వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నోముల, కడపర్తి, నెల్లిబండ, చందంపల్లి, తాటికల్లు, చందపట్ల గ్రామాల సర్పంచుల పదవీకాలం ముగియడంతో వారిని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నడికుడి ఉమారాణి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo