మత సామరస్యానికి ప్రతీక ఉర్సు

- లతీఫ్ ఉల్లాషా ఖాద్రి ఉర్సు షురూ...
- నల్లగొండ పురవీధుల్లో గంధం ఊరేగింపు
- ప్రత్యేక పూజలు చేసిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ కల్చరల్ : మత సామరస్యానికి ప్రతీకైన హజ్రత్ సయ్యద్‌షా లతీఫ్ ఉల్లాషా ఖాద్రీ ఉర్సు గురువారం నల్లగొండలో వైభవంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా గడియారం సెంటర్ సమీపంలోని మదీనా మసీదు వద్ద ఉర్సు ఉత్సవాల గంధం ఊరేగింపును శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీ ఏవీ రంగనాథ్‌తో కలిసి ప్రారంభించారు. మసీద్ నుంచి గంధాన్ని ఊరేగింపుగా తరలించారు. పట్టణ పురవీధుల నుంచి పాతబస్తీ వరకు వెళ్లి అక్కడి నుంచి రాత్రి దర్గా మెట్ల వద్దకు గంధం చేరుకోగా ఘన స్వాగతం పలికి గుట్టపైకి తీసుకెళ్లారు. ఊరేగింపులో ముస్లిం యువత చేసిన నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ హజ్రత్ సయ్యద్‌షా లతీఫ్ ఉల్లాషా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఉత్సవాలను కొవిడ్ నింబంధనలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ లతీఫ్ సాబ్ దర్గా ఎంతో ప్రాచుర్యం కలిగిందని, ప్రతి సంవత్సరం ఉర్సు ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ శరత్చంద్ర, దర్గా ముతవల్లి రషీద్సాబ్, జామాల్ఖాద్రి, సయ్యద్ హాషం, కౌన్సిలర్లు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..