మంగళవారం 19 జనవరి 2021
Nalgonda - Dec 02, 2020 , 01:27:49

ఎమ్మెల్యే నోములకు ఘననివాళి

ఎమ్మెల్యే నోములకు ఘననివాళి

హాలియా : ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పార్థివదేహాన్ని మంగళవారం హాలియలోని ఆయన నివాసానికి తీసుకు రాగా.. పలువురు సందర్శించి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో డీసీసీ అధ్యక్షుడు రమావత్‌ శంకర్‌నాయక్‌, నాయకులు కుందూరు రఘువీర్‌రెడ్డి, జయవీర్‌రెడ్డి, గుండెబోయిన కోటేశ్‌ యాదవ్‌, బీజేపీ నాయకులు కడారి అంజయ్య యాదవ్‌, వాసుదేవుల జితేందర్‌రెడ్డి, బాబురావునాయక్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు,  హాలియా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మా శంకరయ్య,  ఎంపీపీ పేర్ల సుమతీ పురుషోత్తం, ఆంగోతు భగవాన్‌నాయక్‌, బొల్లం జయమ్మ, చెన్ను అనురాధాసుందర్‌రెడ్డి, మంచుకంటి వెంకటేశ్వర్లు. జడ్పీటీసీలు సూర్య బాష్యానాయక్‌, అబ్బిడి కృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు నీలిమా మహేందర్‌రెడ్డి, కామర్ల జానయ్య, ఇరిగినేని అంజయ్య, మలిగిరెడ్డి లింగారెడ్డి, మన్నెం రంజిత్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు యడవల్లి విజయేందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, మన్నెం రంజిత్‌యాదవ్‌, అబ్బిరెడ్డి కృష్ణారెడ్డి, రవినాయక్‌, తాటి సత్యపాల్‌, నరేందర్‌, మర్ల చంద్రారెడ్డి, తుమ్మలపల్లి  చంద్రశేఖర్‌రెడ్డి, చింతల చంద్రారెడ్డి, గౌని రాజా రమేశ్‌యాదవ్‌, సీఐటీయూ నాయకుడు లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు. 

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో..

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల్లో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మున్సిపల్‌ కమిషనర్‌ వేమనరెడ్డి, తాసీల్దార్‌ మంగ, ఎంపీడీఓ లక్ష్మి, డాక్టర్‌ శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు. యాదవసంఘం ఆధ్వర్యంలో నోముల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జవ్వాజి వెంకటేశ్వర్లు, కురాకుల వెంకటేశ్వర్లు, గౌని రాజారమేశ్‌ యాదవ్‌, కట్టెబోయిన గోవర్ధన్‌ యాదవ్‌, సైదులు, బూడిద గోవింద్‌, కూరాకుల రవి, రావుల శ్రీను, కిలారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే మృతి తీరని లోటు

గుర్రంపోడు : నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో మండలంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తమ ప్రియతమ నాయకుడిని కడసారి చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు హైదారాబాద్‌, హాలియాకు తరలివెళ్లారు. మండలకేంద్రంలోని కూడలిలో నోముల చిత్రపటాన్ని ఉంచి పలువురు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ గాలి సరితారవికుమార్‌, సర్పం చ్‌ షేక్‌ మస్రత్‌ సయ్యద్‌మియా, టీఆర్‌ఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్‌ రావు, నాయకులు పాశం గోపాల్‌రెడ్డి, వజ్జ ధనుంజయ్‌, షేక్‌ మదార్‌ తదితరులు పాల్గొన్నారు.

నందికొండ : స్థానిక పైలాన్‌ పిల్లర్‌ వద్ద నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటానికి కౌన్సిలర్‌ ఇర్ల రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, భవననిర్మాణ కార్మిక సంఘం నాయకులు గోవిందు, రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, టీర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంద రఘువీర్‌, కౌన్సిలర్‌ రమేశ్‌జీ, నంద్యాల శ్వేత, జెన్‌కో సీఈ నారాయణ, నాయకులు రంగరాజు, రాంబాబు, బండారు రోషయ్య, యాదగిరిరెడ్డి, తదితరులు హాలియాకు వెళ్లి ఎమ్మెల్యే భౌతికకాయంపై పూలమాలవేసి నివాళులర్పించారు. 

మిర్యాలగూడ రూరల్‌ : ఎమ్మెల్యే నోముల నర్సింహ య్య మృతికి అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియ న్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నామిరెడ్డి నిర్మల సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లా డారు. సంతాపం తెలిపిన వారిలో యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జొన్నలగడ్డ వెంకటరమణ, మజ్జిగపు సునీత, ఈశ్వరమ్మ ఉన్నారు.