సోమవారం 18 జనవరి 2021
Nalgonda - Dec 01, 2020 , 02:53:48

ఆటో బోల్తా.. మృతి

ఆటో బోల్తా..  మృతి

దేవరకొండ : ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన మండలంలోని ఆనంకుంట సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వైదోనివంపు గ్రామానికి చెందిన నల్లగాసు తిరుపతయ్య (36) ఆదివారం రాత్రి పని నిమిత్తం ఆటోతో దేవరకొండకు వెళ్లాడు. పని ముగించుకుని అర్ధరాత్రి సమయంలో స్వగ్రామానికి వెళ్తుండగా ఆనంకుంట సమీపంలోని మూలమలుపు వద్ద పందులు అడ్డం వచ్చాయి. వాటిని తప్పించబోగా   ఆటో బోల్తా పడింది. దీంతో తీవ్ర గాయాలైన తిరుపతయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.