సోమవారం 25 జనవరి 2021
Nalgonda - Dec 01, 2020 , 02:47:06

నేటి నుంచి నట్టల నివారణ మందుల పంపిణీ

నేటి నుంచి నట్టల నివారణ మందుల పంపిణీ

  • జీవాల్లో నట్టల నివారణకు చర్యలు
  • పశు సంవర్ధక శాఖ ప్రత్యేక డ్రైవ్‌

నల్లగొండ :మనుషులకు మాదిరిగానే జీవాలు, పశువులకు ప్రతి ఏడాది సీజనల్‌ వ్యాధులు సోకుతుంటాయి. వాటిల్లో ప్రధానంగా నట్టలు, గాలికుంటు వ్యాధి. వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో పాటు ఎదుగుదల లోపించడం పాల దిగుబడి తగ్గుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతి ఏడాది డిసెంబర్‌,  జూన్‌ నెలల్లో నివారణ చర్యలు చేపడుతోంది. అయితే కొవిడ్‌ నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. అయితే ఈ మందుల పంపిణీ తిరిగి నేటి నుంచి కొనసాగనుంది. ఇందుకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 55, 50 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో వైద్యుడితో పాటు అటెండర్‌, ప్యారామెట్‌, గోపాలమిత్ర ఉంటారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి ఈ వైద్య బృందం పర్యటించి మందు వేయనుంది. 

కొవిడ్‌ నేపథ్యంలో ఆలస్యం..

ప్రతి సంవత్సరం నట్టల నివారణ, గాలి కుంటు వ్యాధుల నియంత్రణకు  రెండు సార్లు పశుసంవర్ధ్ధక శాఖ వైద్య బృందం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి  మందులు పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో మందుల పంపిణీ చేయలేదు. ఈ నేపథ్యంలో జీవాలు, పశువుల్లో ఎదుగుదల , పాల దిగుబడి తగ్గడం, మృత్యువాత పడుతుండడం గుర్తించిన అధికారులు సర్కార్‌కు నివేదించడంతో వెంటనే తొలుత నట్టల నివారణపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించింది.   

నల్లగొండ జిల్లాలో 14 లక్షల జీవాలు, 5.20 లక్షల పశువులు.. 

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 14 లక్షల జీవాలు ఉండగా 5.20 లక్షల పశువులు ఉన్నాయి. 14 లక్షల జీవాల్లో పది లక్షల గొర్రెలు ఉండగా మిగిలినవి మేకలు ఉంటాయి. ఈ గొర్రెల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఆరు లక్షలు పంపిణీ చేసింది. సూర్యాపేట జిల్లాలో 6.5 లక్షల జీవాలు,9 పశువులు 2,89,839   ఉన్నాయి. ప్రస్తుతం జీవాల్లో ఈ నట్టల నివారణ చర్యలు చేపట్టి డిసెంబర్‌ 10 నుంచి పశువులకు వేయనున్నారు. ఆ తర్వాత జనవరి నుంచి గాలి కుం టు వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ ఏర్పాటు చేసి ఉచితంగా పశువులకు టీకాలు వేయనున్నారు.  

 పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి

 సీజనల్‌గా జీవాలు, పశువుల్లో వచ్చే నట్టల  నివారణకు జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి మందుల పంపిణీ చేపట్ట నున్నాం. జిల్లాలో 55 వైద్య బృందా లను ఏర్పాటు చేశాం. నేటి నుంచి జీవాలకు వేసి మరో పది రోజుల తర్వాత పశువులకు సైతం వేస్తాం. అనంతరం గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తాం. ఈ మందులు వేయకపోతే జీవాలు, పశువుల్లో ఎదుగుదల లోపిండచంతో పాటు మృత్యువాత పడే అవకాశం ఉంది. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.logo