ఆదివారం 24 జనవరి 2021
Nalgonda - Nov 28, 2020 , 02:41:13

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు

  • నందికొండ మున్సిపల్‌ కమిషనర్‌ పల్లారావు

నందికొండ : నందికొండ మున్సిపాలిటీ  పరిధిలో అనుమతులు లేకుం డా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ పల్లారావు హెచ్చరించారు. పైలాన్‌, హిల్‌కాలనీల్లో    చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం కమిషనర్‌ జేసీబీ సహాయంతో తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన నందికొండ మున్సిపాలిటీకి సంబంధించిన గతంలోని ఎన్నెస్పీ పరిధిలో ఉన్న ఇండ్లు, ఆస్తులను కలెక్టర్‌కు అప్పగించారని చెప్పారు. కిందిస్థాయి ఎన్నెస్పీ అధికారులు తమ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు  చేస్తామని చెప్పారు. 


logo