శుక్రవారం 22 జనవరి 2021
Nalgonda - Nov 25, 2020 , 01:30:28

రవాణా వాహనాలకు పన్ను రద్దుపై హర్షం

రవాణా వాహనాలకు పన్ను రద్దుపై హర్షం

సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం

మిర్యాలగూడ: కరోనా కష్టకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రవాణా వాహనాలకు పన్ను రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మిర్యాలగూడ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో  సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు పిశాటి నర్సిరెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల వాహన రంగం తీవ్రంగా నష్టపోయిందని దానిని అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌ రెండు త్రైమాసీకాల పన్నును రద్దు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చాంద్‌ పాషా, సింగాపురం మల్లారెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటయ్య, రవీందర్‌రావు, మల్లయ్య యాదవ్‌, అనంతుల శ్రీనివాసులు, రామకృష్ణ, పెద్దిరెడ్డి, నాగేశ్వర్‌రావు తదితరులు  పాల్గొన్నారు. 

 కొండమల్లేపల్లిలో..

కొండమల్లేపల్లి : మండలంలోని కోల్‌ముంతల్‌పహాడ్‌ వద్ద గల కొండమల్లేపల్లి-దేవరకొండ లారీ ఓనర్స్‌, వర్కర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం సీఎం కేసీఆర్‌  ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రావుల చంద్రయ్య, కాటమోని వెంకటయ్య, ఎస్‌.కే.యూసుఫ్‌, ఎండీ షబ్బీర్‌, రేవల్లి అంజయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు


logo