ఆదివారం 24 జనవరి 2021
Nalgonda - Nov 13, 2020 , 03:18:56

రైతులు సంయమనం పాటించాలి

రైతులు సంయమనం పాటించాలి

  • మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం రాక
  • కొంత ఆలస్యమైనా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ ప్రతినిధి, నమ స్తే తెలంగాణ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు సంయమనం పా టిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొంత ఆలస్యమైనా పూర్తిస్థాయిలో కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పా రు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయడమే లక్ష్యంగా ఏర్పాట్లు కూడా చేసిందని తెలిపారు. గురువారం నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ సీజన్‌లో జిల్లాలో ఉన్న రైస్‌ మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం వస్తుందని, ఒకేసారి తీసుకురావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. వచ్చే ధాన్యా న్ని టోకెన్ల ద్వారా క్రమబద్ధీకరిస్తూ రైతులు ఇబ్బంది పడకుండా కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్‌తో పాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రైతులు కూడా అధికారులకు, ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.

మిల్లర్లు రైతులకు నష్టం జరుగకుండా కొనుగోళ్లకు సహకరించాలన్నారు. గతంలో తేమశాతం ఎక్కువగా ఉన్నా, ధాన్యం నల్లబడినా ఎఫ్‌సీఐ తిరస్కరించేదని,  ప్రస్తుతం ప్రభుత్వం నల్లబడిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు. దేశంలోనే రైతు అనుకూలమైన ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ లాంటి ఫథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మారుస్తున్న ఘనత కూడా కేసీఆర్‌దేనని గుత్తా చెప్పారు. ధరణి పోర్టల్‌తో అవినీతిరహిత, సత్వరసేవలు అందుబాటులోకి వచ్చాయన్నా రు. కొత్త రెవెన్యూ చట్టంతో పారదర్శక సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఇక అర్ధాంతరంగా  నిలిచిపోయిన నకిరేకల్‌-నాగార్జునసాగర్‌ హైవే పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని గుత్తా వెల్లడించారు.

సీఎం కేసీఆర్‌ కృషి మేరకు 85 కిలోమీటర్ల జాతీయ రహదారి పూర్తికి 421.64కోట్లతో టెండర్లు పిలిచారని తెలిపారు. దీంతో పాటు కొండమల్లేపల్లి-దేవరకొండ మధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రెండులేన్ల రోడ్డును కూడా నాలుగు లేన్లుగా విస్తరించడానికి రూ. 12.54 కోట్లు అదనంగా మం జూరు చేశారని వెల్లడించారు. గతంలో దీనిపై తాను కేంద్ర మం త్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాశానని, అందు కు ఆయ న స్పందిస్తూ నిధులు విడుదల చేశారని తెలిపారు. ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పా రు. 


logo