గురువారం 04 మార్చి 2021
Nalgonda - Nov 06, 2020 , 01:23:02

కరోనా వ్యాప్తికి కళ్లెం..!

కరోనా వ్యాప్తికి కళ్లెం..!

నీలగిరి : కరోనా వైరస్‌ వ్యాప్తి నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. జిల్లాలో గత రెండు నెలలో పోలిస్తే పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నా యి. ఆగస్టులో 5,282 పాజిటివ్‌ కేసులు, సెప్టెంబర్‌లో 8,552 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అక్టోబర్‌లో కేవలం 2,770 మాత్రమే పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

అక్టోబర్‌  చివరి నాటికి జిల్లాలో 1,52,592 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 17,985 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 15,959 డిచార్జ్‌ కాగా వీరిలో 14వేల  మంది హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందారు. మిగిలిన 2వేల మంది దవాఖానకు వెళ్లి చికిత్స పొందారు. వీరిలో కేవలం 61 మంది చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 1965 మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. హోం ఐసొలేషన్‌ ఉండి వైద్యారోగ్యశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ చాలా వేగంగా కొలుకుంటున్నారు. ఏడు నెలలుగా అనేక రకాల ఇబ్బందులు పడ్డ ప్రజలు అక్టోబర్‌ మాసంలో కొంత ఉపశమనం పొందారు. కరోనాపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన రావడంతో పాటు ప్రతి ఒక్కరూ శానిటైజర్లు వాడడం, మాస్కులు ధరించడం వల్ల కరోనాను కట్టడి చేస్తూ ముందుకు సాగుతున్నారు.

అధికారుల చర్యలతో తగ్గుముఖం                                              

జూలై నుంచి ప్రతి రోజు భారీగా కేసులు నమోదు కావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. జూలై  నుంచి ప్రతి రోజు మూడు వందలకు పైగా కరోనా కేసులు నమోదవుతూ వచ్చాయి. కరోనాతో హోం ఐసొలేషన్‌, కొవిడ్‌ దవాఖానలు, కొవిడ్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య వేలల్లో ఉం డగా ఇప్పుడు కేవలం 2వేల లోపు మాత్రమే ఉంది. వీరిలో కూడా అత్యధికంగా ఇండ్లలోనే చికిత్స పొందుతున్నారు. రెండు జిల్లాల్లో రెండు మాసాలుగా తీసుకుంటున్న చర్యలు కారణంగా ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి జిల్లాలో తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణమని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా మరింత సహకరించి కరోనా జాగ్రత్తలు పాటిస్తే రానున్న రోజుల్లో కూడా మరింత కరోనా వ్యాప్తి తగ్గించడానికి అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. 

జిల్లాలో విస్తృతంగా పరీక్షలు.. 

కొంతకాలంగా జిల్లా వైద్యారోగ్యశాఖ టెస్టుల సంఖ్య పెంచింది. విస్తృతంగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌   పరీక్షలతో పాటు జిల్లా కేంద్ర దవాఖానలో ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ బృందాలు కూడా రెండు దఫాలుగా జిల్లాలో పర్యటించి అనుమానిత గ్రా మాల నుంచి పరీక్షలు నిర్వహించారు. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో కూ డా  పరీక్షలు నిర్వహిస్తుండడంతో బాధితులను వే గంగా గుర్తించడం సాధ్యమైంది. ప్రతి ఒక్కరికీ ప రీక్ష చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అక్టోబర్‌ వరకు 1,52 592 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1, 38,509 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు 14,083 మం దికి ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 17,985 మందికి పాజిటివ్‌  వచ్చింది.

పురుషులే అధికం

జిల్లాలో కరోనావైరస్‌ బారిన పడిన వారిలో పురుషులే అత్యధికంగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. మహిళలు ఇండ్లల్లో ఉండడం వల్ల వారు కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడ్డారు. పురుషులు వివిధ రకాల పనుల నిమిత్తం బయటకు వచ్చి వ్యాధి బారిన పడుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు 17,985 మంది కరోనా బారిన పడితే అందులో 11026 మంది పురుషులు, 6859 మంది స్త్రీలు ఉన్నారు. 

VIDEOS

తాజావార్తలు


logo