ఆదివారం 24 జనవరి 2021
Nalgonda - Nov 01, 2020 , 01:36:58

ఫారెస్ట్‌ అధికారుల పర్యటన

ఫారెస్ట్‌ అధికారుల పర్యటన

నల్లగొండ సిటీ : నల్లగొండ మండల పరిధిలోని అప్పాజిపేట, దోమలపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో శనివారం ఫారెస్టు అధికారులు పర్యటించారు. చిరుత సంచరిస్తుందన్న గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అధికారులు ఆయా ప్రాంతాల్లో ట్రాప్‌ కెమెరాలను అమర్చారు. అప్పాజిపేటలో 3, దోమలపల్లిలో 3 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఫారెస్టు రేంజ్‌ అధికారి రాంబాబు తెలిపారు. అటవీమృగాలు కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలని గ్రామస్తులకు సూచించారు. బంధించేందుకు బోనులు కూడా సిద్ధంగా ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు సిబ్బంది మల్లేశ్‌, నర్సింహ పాల్గొన్నారు.


logo