ఆదివారం 29 నవంబర్ 2020
Nalgonda - Oct 31, 2020 , 02:42:43

ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే..

ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే..

  మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

చండూరు/ మర్రిగూడ/ నాంపల్లి/ మునుగోడు : టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. త్వరలో జరుగబోయే నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మర్రిగూడ, నాంపల్లి, మునుగోడు మండల కేంద్రాల్లో శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ప్రజలకు విశ్వాసముందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి పట్టభద్రులతో ఓటు నమోదు చేయించాలన్నారు. ఈ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్మిక విభాగం అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, మండలాధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, దంటు జగదీశ్వర్‌, గుమ్మడపు నర్సింహారావు, బండా పురుషోత్తంరెడ్డి, ఎంపీపీలు మెండు మోహన్‌రెడ్డి, కర్నాటి స్వామి, జడ్పీటీసీలు ఆశం సురేందర్‌రెడ్డి, నారబోయిన స్వరూపారాణి, కర్నాటి వెంకటేశం, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, సహకార చైర్మన్లు పందుల యాదయ్యగౌడ్‌, బాలం నర్సింహ, రాష్ట్ర నాయకులు నారబోయిన రవి, ఉజ్జిని అనిల్‌రావు, భూతరాజు దశరథ, కోడి వెంకన్న, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు