శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nalgonda - Oct 31, 2020 , 02:36:38

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి

 డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ దయాకర్‌రెడ్డి 

చిట్యాల : ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుండ్రాంపల్లి, సుంకెనపల్లి, ఏపూరు గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్‌, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, సర్పంచులు పుష్ప, బొందయ్య, మాధవి, ఎంపీటీసీ పద్మ, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ నాగరాజు, డైరెక్టర్లు పాల్గొన్నారు.