శనివారం 28 నవంబర్ 2020
Nalgonda - Oct 31, 2020 , 02:36:38

ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే కంచర్ల శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే కంచర్ల శుభాకాంక్షలు

నల్లగొండ కల్చరల్‌/నార్కట్‌పల్లి : రాష్ట్ర శాసనమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవితను శుక్రవారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యే సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ఉన్నారు. అదేవిధంగా నకిరేకల్‌ నియోజకవర్గ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు టీజీ లింగం కవితకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.