శనివారం 28 నవంబర్ 2020
Nalgonda - Oct 31, 2020 , 02:36:37

త్రిపురారం, నిడమనూరు కేంద్ర సహకార బ్యాంకుల్లో అక్రమాలు

త్రిపురారం, నిడమనూరు కేంద్ర సహకార బ్యాంకుల్లో అక్రమాలు

సేవింగ్‌ ఖాతాల్లో నుంచి రూ.18 లక్షలు మాయం 

ఐటీ, ఆడిట్‌ తనిఖీల్లో వెలుగులోకి..

నిడమనూరు : రైతుల అభివృద్ధే ధ్యేయంగా పని చేయాల్సిన సహకార బ్యాంకు సిబ్బంది అక్రమాలకు   చేను మేసిన చందంగా ఖాతాదారుల సొమ్మును మింగేశారు.  లావాదేవీలు జరుపని ఖాతాల  డబ్బు మాయం చేశారు. త్రిపురారం, నిడమనూరు సహకార బ్యాంకు శాఖల్లోని సేవింగ్స్‌ ఖాతాల నుంచి రూ.18 లక్షలు తీసి తమ బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.  ఐటీ సెల్‌ నిర్వహించిన తనిఖీల్లో  బయటపడింది. ఈ విషయం  పొక్కకుండా ఉండేందుకు   దిద్దుబాటు  చేపడుతున్నట్లు తెలిసింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి..  త్రిపురారం సహకార బ్యాంకుల్లో కొంతకాలంగా ఎలాంటి లావాదేవీలు జరుపకుండా ఉన్న సేవింగ్స్‌ ఖాతాలపై కన్నేసిన సిబ్బంది డబ్బు మాయం చేసేందుకు పూనుకున్నారు. సదరు ఖాతాల్లోని సొమ్మును తమ బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఆంధ్రా రాష్ట్రంలోని ఓ బ్యాంకుకు విడుతల వారీగా బదిలీ చేశారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా త్రిపురారం బ్రాంచిలో రూ.16 లక్షలు, నిడమనూరు శాఖలో రూ.2లక్షలు కొట్టేశారు.  బ్యాంకు శాఖలో ఐటీ సెల్‌, ఆడిట్‌ తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది.  ఖాతాల్లోని సొమ్మును నెఫ్ట్‌  ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌), ఆర్‌టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గ్రాస్‌ అమౌంట్స్‌ సెటిల్డ్‌) ద్వారా బదిలీ చేసినట్లు ఐటీ సెల్‌ గుర్తించింది.  ఆన్‌లైన్‌ సహకార బ్యాంకు బ్రాంచిల్లో లాగిన్‌ అయ్యేందుకు అత్యంత రహస్యంగా మేనేజర్లకు మాత్రమే తెలిసిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా సొమ్ము కాజేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

బయటకు పొక్కకుండా జాగ్రత్తలు..

సదరు బ్యాంకు శాఖల్లో అక్రమాలకు పాల్పడిన విషయం  చూడటంతో  ఈ తతంగాన్ని గుట్టుచప్పుడు కాకుండా  రూపయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఱెరూకమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.  పైస్థాయి అధికారులు   వినిపిస్తున్నాయి. అయితే.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పలువురు ఖాతాదారులు కోరుతున్నారు.

ఈ విషయంపై  కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ  వివరణ కోరగా.. సేవింగ్స్‌ ఖాతాల నుంచి సొమ్ము మాయం ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు.  స్థాయి విచారణ చేపడుతున్నామని చెప్పారు.   బ్యాంకు లావాదేవీలు కావడంతో విచారణ దశలో ఉందని, మరో రెండ్రోజుల్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.