శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nalgonda - Oct 28, 2020 , 00:21:44

బీఆర్‌ఏఓయూలో అడ్మిషన్లకు నేడు చివరి గడువు

బీఆర్‌ఏఓయూలో అడ్మిషన్లకు నేడు చివరి గడువు

  • 31నుంచి పరీక్షలు షురూ
  • ఉమ్మడిజిల్లా డీడీ డాక్టర్‌ బి.ధర్మానాయక్‌

నల్లగొండ విద్యావిభాగం : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ కోర్సులో చేరడానికి ఈనెల 28వ తేదీ చివరి గడువని ఆ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడిజిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ధర్మానాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. www.beaou.ac. inలో ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు తీసుకోవచ్చన్నారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పది అధ్యయన కేంద్రాల్లో యూజీ, నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో పీజీలో చేరవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నల్లగొండలోని రీజినల్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌లోగాని, 08682 223768 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

31నుంచి పరీక్షలు షురూ..

ఈనెల 21నుంచి జరగాల్సిన ఓల్డ్‌ బ్యాచ్‌ డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు వర్షాల కారణంగా వాయిదాపడిన సంగతి విదితమే. ఆ పరీక్షలను తిరిగి ఈనెల 31నుంచి నవంబర్‌ 2వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఏవీఎన్‌ రెడ్డి వెల్లడించారని బి.ధర్మానాయక్‌ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10నుంచి 1గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లు గమనించి విద్యార్థులకు సమాచారం అందజేయాలన్నారు.