శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nalgonda - Oct 25, 2020 , 02:15:15

పేద ప్రజలకు మెరుగైన వైద్యం

పేద ప్రజలకు మెరుగైన వైద్యం

  •   ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
  •  ప్రభుత్వ దవాఖానలో డిజిటల్‌ ఎక్స్‌రే ప్రారంభం

దేవరకొండ: తెలంగాణ ప్ర భుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అధి క ప్రాధాన్యత ఇస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. ప్రభుత్వ దవాఖానలో రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డిజిటల్‌ ఎక్స్‌రే విభాగాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దవాఖానలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేసేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలో వెంటిలేటర్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేశ్‌గౌడ్‌, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, వైస్‌ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్‌, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, డీసీహెచ్‌ మాతృనాయక్‌, సూపరింటెండెంట్‌ రాములునాయక్‌ పాల్గొన్నారు. అనంతరం రాంనాయక్‌ సినిమా ట్రిజర్‌ను ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ శనివారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. గిరిజనుల జీవన విధానంపై సినిమా నిర్మించిన దర్శకుడు శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్యే అభినందించారు.   

తుల్జాభవానీ ఆలయంలో పూజలు

చందంపేట : నేరేడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్‌లో తుల్జాభవానీ ఆలయంలో శనివారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  జడ్పీటీసీ బాలూనాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలయ్య, నాయకులు ముత్యాల సర్వయ్య, హన్మనాయక్‌ , ఆరెకంటి రాములు తదితరులు పాల్గొన్నారు.