శనివారం 05 డిసెంబర్ 2020
Nalgonda - Oct 25, 2020 , 02:15:15

దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

  •   జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి

నార్కట్‌పల్లి : దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కట్‌పల్లి 13వ వార్డులో ఏర్పాటుచేసిన దుర్గా మాత మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనవెంట ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, బాజ యాదయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. 5వ వార్డులో పంచాయతీ నిధుల నుంచి రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్లకు జడ్పీ చైర్మన్‌ బండా, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాన చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేను చిట్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆదిమల్లయ్య, వైస్‌ చైర్మన్‌ కొండూరి శంకర్‌తోపాటు పాలక మండలి సభ్యులు ఘనంగా సన్మానించారు.