మంగళవారం 01 డిసెంబర్ 2020
Nalgonda - Oct 24, 2020 , 00:37:13

దుబ్బాకలో అబద్ధాలు చెబుతున్న ఉత్తమ్‌

దుబ్బాకలో అబద్ధాలు చెబుతున్న ఉత్తమ్‌

  •   హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ ఆరేండ్లలో  అభివృద్ధి ఆరు నెలల్లో చేశాం
  • మార్కెట్‌  పాలకవర్గ సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచాక ఎలాంటి అభివృద్ధి జరుగలేదని దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.  ఉత్తమ్‌ ఆరేండ్లలో  అభివృద్ధి ఆరు  చేశామన్నారు. 6 నెలల్లో పదికి పైగా జీఓలు తెచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీదేనన్నారు. ఉత్తమ్‌ కంటికి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు, ఆర్డీఓ కార్యాలయం, బంజారాభవన్‌, ఈఎస్‌ఐ దవాఖాన, పాలిటెక్నిక్‌, ఐటీఐ కాలేజీలు, వంతెనల నిర్మాణం, హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు, మండల కేంద్రాలకు రూ.30 లక్షలు  చేసిన జీఓలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌ అభివృద్ధిపై దుబ్బాక సెంటర్‌లో కూర్చొని మాట్లాడుదామని మంత్రి హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు ఉత్తమ్‌ పత్తా లేకుండా పోయాడన్నారు.  జరిగిన అభివృద్ధిని దుబ్బాకలో ప్రచారం చేయడానికి ప్రతి గ్రామం నుంచి నలుగురు యువకులు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికలు రాగానే టీఆర్‌ఎస్‌ పార్టీని, సీఎం కేసీఆర్‌ను బదనాం చేయడానికి కాంగ్రెస్‌, బీజేపీలు అనేక కుయుక్తులు పన్నుతాయని, ఓడిపోగానే పత్తా లేకుండా పోతాయని ఎద్దేవా చేశారు.  తీసుకొస్తున్న వ్యవసాయ  తెలంగాణ రైతుల  శాపంగా మారుతున్నాయన్నారు.  

హుజూర్‌నగర్‌కు మంచి రోజులొచ్చాయి- ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌

కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిన రోజు నుంచే హుజూర్‌నగర్‌లో మంచి రోజులు ప్రారంభమయ్యాయని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించినవన్నీ దాదాపు   త్వరలో రానున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా టీఆర్‌ఎస్‌దే గెలుపన్నారు.  

రైతులకు, మార్కెట్‌కు అనుసంధానంగా ఉండాలి  ఎమ్మెల్యే సైదిరెడ్డి

మార్కెట్‌   రైతులకు, మార్కెట్‌కు అనుసంధానంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా  మఠంపల్లిలో నూతన మార్కెట్‌ ఏర్పాటు జరిగేలా చూడాలని సూచించారు.  మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్‌ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు,  నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్లు గెల్లి అర్చన, జయబాబు, ఎంపీపీలు గూడెపు శ్రీనివాస్‌, ముడావత్‌ పార్వతి, జడ్పీటీసీలు కొప్పుల సైదిరెడ్డి, సైదిరెడ్డి, కొత్తమద్ది వెంకట్‌రెడ్డి,  ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.