శనివారం 23 జనవరి 2021
Nalgonda - Oct 22, 2020 , 00:27:19

మెడికల్‌ సిబ్బంది వివరాలు సేకరించాలి

మెడికల్‌ సిబ్బంది వివరాలు సేకరించాలి

  • డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు

నీలగిరి : ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు సేకరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అన్నిమళ్ల కొండల్‌రావు కోరారు. బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి జిల్లాలోని మెడికల్‌ ఆఫీసర్లు, ఇతర ప్రైవేటు దవాఖానల డాక్టర్లతో జూమ్‌యాప్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో పనిచేస్తున్న వారి వివరాలు సేకరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయన్నారు. ఫ్రంట్‌ లైన్‌లో ఉండి పనిచేస్తున్న వారికి వచ్చే నెలలో కరోనా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో డోస్‌లు తయారు చేసేందుకు వివరాలు అందజేయాల్సి ఉందన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.అరుంధతీరెడ్డి, డెమో రవిశంకర్‌, ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ హరికృష్ణ, డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 


logo