సోమవారం 18 జనవరి 2021
Nalgonda - Oct 22, 2020 , 00:27:19

సాగర్‌కు కొనసాగుతున్న వరద

సాగర్‌కు కొనసాగుతున్న వరద

  • 3,42,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 
  • 18క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల 

నందికొండ : నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్‌కు 3,42,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో అదేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590(312.50 టీఎంసీలు)అడుగులకు బుధవారం 589.50 అడుగుల వద్ద 310.5510 టీఎంసీల నీరు నిల్వ ఉంది.  డ్యాం క్రస్టుగేట్ల ద్వారా 3,09,132 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 7,778,  ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 25,050 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎడమ, వరద కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు 884.10( 210.5133 టీఎంసీలు)అడుగల వద్ద నీరు నిల్వ ఉంది.   

మూసీకి 16వేల క్యూసెక్కులు..  

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి బుధవారం 16,688 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా 12,119 క్యూసెక్కులను దిగువకు వదులుతుండగా, 45 క్యూసెక్కులు ఆవిరవుతోంది. 70క్యూసెక్కులను కాల్వలకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 641.40 అడుగుల(3.54 టీఎంసీలు)వద్ద నీరు నిల్వ ఉంది. 

174.210అడుగుల వద్ద పులిచింతల.. 

చింతలపాలెం : పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175.00(45.77టీఎంసీలు)అడుగులకు  బుధవారం 5గంటలకు 174.210(44.5380 టీఎంసీలు)అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 3,55,274 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 13గేట్ల ద్వారా 3,47,274 క్యూసెక్కుల నీరు, తెలంగాణ విద్యుత్‌ కేంద్రం నుంచి 8000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.