గురువారం 22 అక్టోబర్ 2020
Nalgonda - Oct 18, 2020 , 04:08:05

జిల్లా జైలును సందర్శించిన మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌

జిల్లా జైలును సందర్శించిన  మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌

నల్లగొండ క్రైం : జిల్లా కారాగారాన్ని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య శనివారం సందర్శించారు. ఖైదీల నివాస స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందుతున్న న్యాయసేవలు, ఆరోగ్య, ఆహార విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తి జస్టిస్‌ వీవీ రమేశ్‌, లీగల్‌ సెక్రటరీ వేణు, అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి నాగరాజు, జైల్‌ సూపరింటెండెంట్‌ దేవ్‌లా, మెడికల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, జైలర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ జైలర్‌ జనార్దన్‌రెడ్డి, హనుమంతరావు ఉన్నారు.   

చంద్రయ్యకు  కలెక్టర్‌, ఎస్పీ స్వాగతం  

నల్లగొండ : జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి. చంద్రయ్యను కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బొకే అందచేసి స్వాగతం పలికారు. వారితో కాసేపు మాట్లాడిన అనంతరం అంధుల పాఠశాలను సందర్శించారు. విశ్రాంత ఐఏఎస్‌ చొల్లేటి ప్రభాకర్‌  కుమారుడు శ్రవణ్‌కుమార్‌ ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.    logo