శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nalgonda - Oct 18, 2020 , 04:01:39

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

 నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

  • 5,34,347 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  
  • 18 క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల 

  నందికొండ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి  5,34,347 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో ఆధారంగా డ్యాం క్రస్టుగేట్లను పెంచుతూ, తగ్గిస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌ పూర్తి నీటి సామర్థ్యం 590(312.50 టీఎంసీలు)అడుగులకు శనివారం 589.20 అడుగుల వద్ద 309.6546 నీరు నిల్వ ఉంది. డ్యాం క్రస్టుగేట్లను 20అడుగుల మేర ఎత్తి 5,01,912 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 7,628, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 24,807 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ, వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు.   

మూసీ నాలుగు గేట్ల ద్వారా& 

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా శనివారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 15,743 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. గేట్ల ద్వారా 12,342 క్యూసెక్కులు వెళ్తుండగా, 45 క్యూసెక్కులు ఆవిరవుతోంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 642.95(3.93 టీఎంసీలు)అడుగులుగా  ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పులిచింతలకు 5.62లక్షల ఇన్‌ఫ్లో.. 

చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175.00(45.77 టీఎంసీలు) అడుగులకు శనివారం 173.2262(43.0610 టీఎంసీలు)అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 5,62,371 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా ప్రాజెక్టు 17 గేట్ల ద్వారా 5,62,371 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.