మంగళవారం 19 జనవరి 2021
Nalgonda - Oct 16, 2020 , 01:10:45

సాగర్‌కు వరద ఉధృతి

 సాగర్‌కు వరద ఉధృతి

  • ఇన్‌ఫ్లో 4,83,846, అవుట్‌ఫ్లో 5,00,446 క్యూసెక్కులు 
  • 18క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల 

నందికొండ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో డ్యాం 18క్రస్టుగేట్లను 15అడుగుల మేర ఎత్తి 3,88,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 4,83,846 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో ఆధారంగా డ్యాం క్రస్టుగేట్లను పెంచుతూ, తగ్గిస్తూ ఉన్నారు. రిజర్వాయర్‌ పూర్తి నీటి సామర్థ్యం 590(312.50టీఎంసీలు)అడుగులకు గురువారం  589.10 అడుగుల వద్ద 309.3558 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గేట్ల ద్వారా 4,93,278  క్యూసెక్కులు,  కుడికాల్వ ద్వారా 7828,  ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29,070 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నుంచి 5,00,446 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా ఎడమ కాల్వ, ఎస్‌ఎల్‌బీసీ, వరద కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు.    

పులిచింతలకు 4.73లక్షల ఇన్‌ఫ్లో

చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175.00(45.77టీఎంసీలు) అడుగులకు గురువారం సాయంత్రం 172.898(42.5720 టీఎంసీలు)అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 4,73,518 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 18గేట్ల ద్వారా 5,33,690 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్‌ కేంద్రం నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.