సోమవారం 26 అక్టోబర్ 2020
Nalgonda - Oct 02, 2020 , 00:47:03

మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సంతకం ఫోర్జరీ

మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సంతకం ఫోర్జరీ

  • నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్ల సృష్టి
  • వాటితో జాయినింగ్‌కు వచ్చిన  ఇద్దరు అభ్యర్థులు
  •   గుర్తించి పోలీసులకు ఫిర్యాదు,  కేసు నమోదు 

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ  నల్లగొండ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగుచూసింది. ఏకంగా ప్రిన్సిపాల్‌ సంతకాన్నే ఫోర్జరీ చేయడంతోపాటు అదే కాలేజీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా అపాయింట్‌ చేసుకోవాలని లెటర్‌ తయారు చేశారు. దాన్ని చూపించి ఇద్దరు అమాయకుల నుంచి రెండు లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశారు. తీరా ఆ అపాయింట్‌మెంట్‌ లెటర్లతో మెడికల్‌ కాలేజీకి వెళ్తే.. అసలు విషయం బయటపడింది.  కాలేజీ ప్రిన్సిపాల్‌ నల్లగొండ టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. 

మండల కేంద్రానికి  డి.నరేశ్‌, అదే మండలం ఇస్మాయిల్‌పల్లికి చెందిన చింత శంకర్‌ను ఓ ముఠా నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లతో బురిడీ కొట్టించింది.  వద్ద నుంచి 1.10లక్షల రూపాయలు తీసుకుని నార్కట్‌పల్లి మండలం పోతినేనిపల్లికి చెందిన పాత నేరస్తుడు ఆదిమళ్ల వెంకన్న ఫేక్‌ లెటర్లు సృష్టించాడు. జిల్లా మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమిస్తున్నట్లు ఆ లెటర్లలో మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజకుమారి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆగస్టు  తేదీతో తయారు చేసిన ఈ లెటర్లను తీసుకుని గురువారం నరేశ్‌ అనే యువకుడు మెడికల్‌ కాలేజీకి వెళ్లాడు. అక్కడ ఈ లెటర్‌ను చూసిన అధికారులకు అనుమానం వచ్చింది. ఇలాంటి అపాయింట్‌మెంట్‌ లెటర్లు ప్రిన్సిపాల్‌ పేరుతో ఇవ్వరు కదా.. అని చెక్‌ చేశారు. విషయాన్ని ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లగా.. 

లెటర్‌గా గుర్తించారు.  వెంటనే నల్లగొండ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నర్సింహ కేపాథమికంగా విచారణ చేసి..  పాత నేరస్తుడు ఆదిమళ్ల వెంకన్న పాత్ర ఉందని భావించారు.  కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ఆదిమళ్ల వెంకన్నను గత నెల 11న పలుచోట్ల దొంగతనాలు చేసిన కేసులో నకిరేకల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా ఈ కేసులో పోలీసులు జైలుకు పంపించారు. వెంకన్న గతంలో 17 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇతడిని  నుంచి కస్టడీకి  ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్ల కేసులో విచారణ   టూటౌన్‌ ఎస్‌ఐ నర్సింహ  


logo