సోమవారం 26 అక్టోబర్ 2020
Nalgonda - Oct 02, 2020 , 00:47:08

వివాహిత అదృశ్యం

వివాహిత అదృశ్యం

గుర్రంపోడు : మండలంలోని పిట్టలగూడెం గ్రామానికి చెందిన  అదృశ్యమైంది. ఎస్‌ఐ డి.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలగూడేనికి చెందిన కట్ట ఆంజనేయులుకు కనగల్‌ మండలం చర్లగౌరారం గ్రామానికి చెందిన స్వప్నతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలాఉండగా, గురువారం ఉదయం నుంచి స్వప్న కనబడుటలేదని ఆంజనేయులు మామ అంజయ్యకు ఫోన్‌ చేసి చెప్పాడు.

గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అంజయ్య వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా,గ్రామ సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ కెనాల్‌ వద్ద ఆమె టవల్‌  కుటుంబ సభ్యులు తెలిపారు.


logo