ఆదివారం 25 అక్టోబర్ 2020
Nalgonda - Sep 27, 2020 , 01:24:52

ఉమ్మడి జిల్లా జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు

ఉమ్మడి జిల్లా జడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు

  • నియామక ఉత్తర్వులు అందజేసిన చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి 

నల్లగొండ రూరల్‌ : ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్‌ పరిధిలోని సీనియర్‌ అసిస్టెంట్లు పర్యవేక్షకులుగా, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టులు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన సందర్భంగా శనివారం జడ్పీ కార్యాలయంలో చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి పోస్టింగ్‌ ఉత్తర్వుల కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదోన్నతులు పొందిన ఉద్యోగులు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ ఇన్‌చార్జి సీఈఓ సీతాకుమారి, పంచాయతీ రాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపాల సత్యనారాయణరెడ్డి, కొప్పు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


logo