మంగళవారం 27 అక్టోబర్ 2020
Nalgonda - Sep 26, 2020 , 01:50:43

సాగర్‌ ఎడమ కాల్వలో డీసీఎం బోల్తా

సాగర్‌ ఎడమ కాల్వలో డీసీఎం బోల్తా

  •  క్షేమంగా బయటపడ్డ డ్రైవర్‌

వేములపల్లి : డీసీఎం అదుపు తప్పి  ఎడమ కాల్వలో పడిపోయింది. డ్రైవింగ్‌ చేస్తున్న యజమాని  బయటపడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి మిర్చి కోల్డ్‌ స్టోరేజీలో ఎండు మిరపకాయల లోడు చేసుకున్న  నల్లగొండకు శుక్రవారం ఉదయం బయలుదేరింది.  మండల కేంద్రంలోని సాగర్‌ ఎడమ కాల్వ బ్రిడ్జిపైకి రాగానే అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన 

సైడ్‌ ఇచ్చే క్రమంలో ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో అదుపు తప్పి కాల్వలో పడిపోయింది.  దెపవాహ ఉధృతికి డీసీఎం కొంత దూరం కొట్టుకుపోయింది.  డ్రైవర్‌  హసన్‌పీర్‌ ఈత రానప్పటికీ  డీసీఎం డోరు తెరుచుకుని మిరపకాయ బస్తాలపైకి చేరుకున్నాడు.  గమనించి లుంగీ సహాయంతో రక్షించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ  ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.రెండు క్రేన్లు,  సహాయంతో డీసీఎంను బయటకు తీయించారు.logo