మంగళవారం 27 అక్టోబర్ 2020
Nalgonda - Sep 26, 2020 , 01:50:40

దేవాలయాల పాలక మండళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

దేవాలయాల  పాలక మండళ్లకు  గ్రీన్‌ సిగ్నల్‌

నల్లగొండ కల్చరల్‌  దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాల నూతన పాలక మండళ్ల ఏర్పాటు  ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆ  కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 107 దేవాలయాలకు నూతన పాలక  రానున్నాయి. నల్లగొండ జిల్లాలో 36, సూర్యాపేటలో 44, యాదాద్రి భువనగిరి జిల్లాలో 25 దేవాలయాలున్నాయి. ఆయా దేవాలయాలకు దరఖాస్తులు చేసుకునేందుకు వెల్లడించిన నోటిఫికేషన్‌ తేదీ నుంచి 20 రోజుల్లోగా దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుందని ఆ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్‌ కె.మహేంద్రకుమార్‌ వెల్లడించారు. 

దరఖాస్తు విధానం..

దరఖాస్తు చేయడానికి 30 సంవత్సరాలు పైబడినవారు అర్హులు. శాఖ సూచించిన నిర్ణీత దరఖాస్తులో నింపి అందజేయాలి. ఒక ఒరిజినల్‌, మూడు జిరాక్స్‌ కాపీలు కలిపి మొత్తం నాలుగు సెట్లు   ఆధార్‌, కుల ధ్రువీకరణ పత్రం, 4 కలర్‌ ఫొటోలు జత చేయాలి.    దరఖాస్తుపై నోటరీ, గెజిటెడ్‌ అధికారి సంతకం విధిగా ఉండాలి.   సహాయ కమిషనర్‌, ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ నల్లగొండ  ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటలలోపు  స్వీకరిస్తారు.

సీతారామాలయానికి అక్టోబర్‌14లోగా దరఖాస్తు :  మోకిరాల రాజేశ్వరశర్మ

నల్లగొండ కల్చరల్‌ : రెండో  పేరుగాంచిన నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో  సీతారామచంద్రస్వామి దేవాలయం నూతన పాలకమండలి (ధర్మకర్తలు) కోసం అర్హులు దరఖాస్తు  ఆలయ ఈఓ మోకిరాల రాజేశ్వరశర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా పాతబస్తీలోని శ్రీసంతోషిమాత దేవాలయానికి     ధర్మాదాయ శాఖ నల్లగొండ జిల్లా కార్యాలయంలో  ఈ నెల 25నుంచి అక్టోబర్‌ 14లోగా దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.  పాలకవర్గ కమిటీ  కొనసాగుతుందని వెల్లడించారు. 


 


logo