కరోనా నుండి కాపాడుకోవాలంటే మనకు శ్రీరామరక్షగా నిలిచేది మాస్క్ మాత్రమే. సెకండ్ వేవ్ ఉదృతిగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వీలైతే ఇంట్లోను మాస్క్ ధరించి ఉండడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఆ బాటలోనే స్నేహా రెడ్డి, అర్హలు వెళుతున్నారు. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయని తన సోషల్ మీడియాలో పేర్కొన్న విషయం తెలిసిందే.
రీసెంట్గా తనతో టచ్‌లో ఉన్న వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు. అయితే బన్నీకి పాజిటివ్ అని తేలడంతో ఆయన ఫ్యామిలీ మొత్తం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఐసోలేషన్‌లో ఉన్న వారు ఎలా సందడి చేస్తున్నారనే విషయాన్ని బన్నీ తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా తెలియజేశాడు. స్నేహా రెడ్డి తన కూతురు ఇద్దరు మాస్క్ ధరించి ఎంచక్కా ఆడుకుంటుండగా, అయాన్ ఎప్పటిలానే తన పనిలో బిజీగా ఉన్నాడు. బన్నీ షేర్ చేసిన వీడియోస్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.