శనివారం 31 అక్టోబర్ 2020
Nalgonda - Sep 21, 2020 , 04:24:56

మోడల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి

మోడల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి

దామరచర్ల : మండల పరిధిలోని బొత్తపాలెంలో ఉన్న ఆదర్శ పాఠశాల అనుబంధ జూనియర్‌ కళాశాలలో 2020-21 విద్యా సంవత్సరం ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ పి.అజారయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2020 మార్చిలో ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులైన విద్యార్థులు www.tsmodelschools.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కళాశాలలో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని, ఒక్కో గ్రూపులో 40సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని అక్టోబర్‌ 1లోగా శ్రీనివాసనగర్‌ మోడల్‌ స్కూల్‌ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను అక్టోబర్‌ 5న ప్రదర్శిస్తామని, ఒరిజినల్‌ సర్టిఫికెట్లను 7వ తేదీన పరిశీలిస్తామని తెలిపారు.