శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nalgonda - Sep 21, 2020 , 03:52:41

సాగర్‌ 14క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల

సాగర్‌ 14క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల

నందికొండ : శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,01,636 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 10క్రస్టుగేట్ల ద్వారా దిగువన నాగార్జునసాగర్‌ డ్యామ్‌కు 2,50,911 క్యూసెక్కుల  నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం 14క్రస్టుగేట్లను 10అడగుల మేర ఎత్తి 2,07,970 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

రిజర్వాయర్‌ పూర్తినీటి సామర్థ్యం 590(312.50 టీఎంసీలు)అడుగులకు 589.20 అడుగులకు చేరి 309.6546 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌ నుంచి ఎడమకాల్వ ద్వారా 2980 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, కుడికాల్వ ద్వారా 8604, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29,557 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాల్వకు నీటి విడుదల లేదు.