మంగళవారం 20 అక్టోబర్ 2020
Nalgonda - Sep 21, 2020 , 03:52:38

సాగర సోయగం.. పర్యాటకుల పరవశం

సాగర సోయగం.. పర్యాటకుల పరవశం

  • 14 క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల 
  • భారీగా తరలివచ్చిన పర్యాటకులు

నాగార్జున సాగర్‌ పర్యాటకులతో సందడిగా మారింది. ఆదివారం డ్యాం నుంచి 14 క్రస్టు గేట్ల ద్వారా నీటిని  దిగువకు వదలగా పరవళ్లు తొక్కుతున్న జలాలను చూసేందుకు భారీగా తరలివచ్చారు. డ్యాం పరిసరాలు, కొత్త వంతెన, శివాలయం ప్రాంతాలు జనంతో కిటకిటలాడాయి. ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారడం, కరోనా విజృంభిస్తుండడంతో డ్యాం సందర్శనకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా పర్యాటకులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. 


logo