సోమవారం 26 అక్టోబర్ 2020
Nalgonda - Sep 20, 2020 , 01:13:34

సాగర్‌ 20క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల

సాగర్‌ 20క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల

  •  ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 4,72,910 
  • ఎడమ కాల్వకు నీటి విడుదల

నందికొండ : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు వస్తున్న వరద ఆధారంగా క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. శనివారం ఉదయం 10క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగగా, శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో పెరుగడంతో క్రస్టుగేట్లను 20కి పెంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590(312.50 టీఎంసీలు)అడుగులకు 589.80అడుగులకు చేరుకొని 311.4474టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండడంతో వచ్చి నీటిని వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేస్తున్నారు. క్రస్టుగేట్ల ద్వారా 4,35,740క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 2162, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 24,604, కుడి కాల్వ ద్వారా 8604 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ డ్యాం నుంచి 4,72,910 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం నుంచి 2,81,120 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. 

 టెయిల్‌పాండ్‌ 8గేట్ల నుంచి..  

అడవిదేవులపల్లి : టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టుకు శనివారం నాగార్జున సాగర్‌ నుంచి సుమారు 1,61,044 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగినట్లు ఏడీ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్‌ 8క్రస్టుగేట్లను 0.83 మీటర్ల మేర ఎత్తి 95,529క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 7.08టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 6.324 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.  

మూసీ 3గేట్ల ద్వారా..

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు 3గేట్ల ద్వారా శనివారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి 7180 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 6935 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 644.10(4.22 టీఎంసీలు)గా ఉన్నట్లు ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు. 


logo