శనివారం 31 అక్టోబర్ 2020
Nalgonda - Sep 19, 2020 , 03:55:19

సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

నందికొండ : నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి 1,71,748 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో 10క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు శుక్రవారం 589.60 అడుగులకు చేరుకొని 310.8498టీఎంసీల నీరు నిల్వ ఉంది.  సాగర్‌ నుంచి క్రస్ట్‌ గేట్ల ద్వారా 1,35,588 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, ప్రధాన జలవిద్యుత్‌ ద్వారా 25,456, కుడికాల్వ ద్వారా 8604, వరదకాల్వ ద్వారా 300 క్యూసెక్కులు మొత్తం 1,71,748 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, ఎడమకాల్వ ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులకు 884.10 (210.5133 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. శ్రీశైలానికి జూరాల నుంచి 2,24,811 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

టెయిల్‌పాండ్‌ 8 గేట్ల నుంచి నీటి విడుదల

అడవిదేవులపల్లి : మండలకేంద్రానికి చేరువలో ఉన్న టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టుకు శుక్రవారం నాగార్జునసాగర్‌ నుంచి   1,61,044 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోందని ఏడీ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. దీంతో టెయిల్‌పాండ్‌ 8క్రస్ట్‌ గేట్లను 0.83మీటర్లు పైకి ఎత్తి 95,529క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. టెయిల్‌పాండ్‌ నీటినిల్వ సామర్థ్యం 7.08టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 6.324 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.

పులిచింతల@174.571 అడుగులు

చింతలపాలెం : పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు) అడుగులకు ప్రస్తుతం 174.571 (45.1027 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువప్రాంతాల నుంచి 1,69,093 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. పులిచింతల ప్రాజెక్టు 6గేట్ల నుంచి 1,25,566 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్‌ కేంద్రం నుంచి 15,000 క్యూసెక్కులు మొత్తం 1,40,566 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో విడుదలవుతోంది.

 మూసీకి 13,520 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువప్రాంతాల నుంచి శుక్రవారం 13,520 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు గేట్ల నుంచి ఔట్‌ఫ్లో లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 641.70(3.62 టీఎంసీలు) అడుగులుగా ఉన్నట్లు ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు.