బుధవారం 21 అక్టోబర్ 2020
Nalgonda - Sep 17, 2020 , 00:56:24

మొక్కల పెంపకానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి

మొక్కల పెంపకానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి

  • నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

రామగిరి: హరితహారానికి సంబంధించి జీపీల్లో  ప్రభుత్వస్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చిన నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లను ఈనెల 25లోగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తాసిల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు, ఏపీఓలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పల్లె ప్రకృతి వనాలు, మొక్కల పెంపకంపై సమీక్షించారు.

అనంతరం మాట్లాడుతూ ప్రైవేట్‌స్థలాల నుంచి ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలకు మార్చిన నర్సరీల్లో ఫెన్సింగ్‌, గేట్‌, నర్సరీ బోర్డు, పాలిథిన్‌ బ్యాగులు, ట్యాంకు కోసం దిమ్మె నిర్మాణం, ఎర్రమట్టి, ప్రైమరీ బెడ్‌లు ఇలా అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా పాత నర్సరీల్లో మొక్కలు భద్రపర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల చివరిలోగా హరితహారం మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డంపింగ్‌యార్డులు, వైకుంఠ ధామాలు, రైతువేదికలను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌, జడ్పీ ఇన్‌చార్జి సీఈఓ సీతాకుమారి, జేడీ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo