సోమవారం 26 అక్టోబర్ 2020
Nalgonda - Sep 09, 2020 , 02:19:56

నాగార్జునసాగర్‌ @587.70అడుగులు

నాగార్జునసాగర్‌ @587.70అడుగులు

నందికొండ : నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590అడుగులకు  మంగళవారం 587.70అడుగుల(305.9222 టీఎంసీల)వద్ద నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు 17,692క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  వస్తుండగా ఎడమకాల్వ ద్వారా 7110 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 8182, వరద కాల్వ ద్వారా 600, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

మూసీ నుంచి  415క్యూసెక్కుల ఔట్‌ఫ్లో  

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నుంచి మంగళవారం 415క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాల్వలకు 365 క్యూసెక్కులు వదలగా, 50క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్లింది. ఎగువ ప్రాంతాల నుంచి 170క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు(4.46 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 644.20 అడుగులు(4.25 టీఎంసీలు)ఉన్నట్లు ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు.  

పులిచింతలకు  2500క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  

చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు) అడుగులకు మంగళవారం సాయంత్రం 4గంటలకు  174.834(45.5133 టీఎంసీలు)అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 2500 క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో వస్తుండగా  విద్యుత్‌ కేంద్రం ద్వారా 5వేల క్యూసెక్కులు విడుదలవుతోంది.   


logo