బుధవారం 21 అక్టోబర్ 2020
Nalgonda - Aug 30, 2020 , 03:07:01

క్షేత్రస్థాయిలో..

క్షేత్రస్థాయిలో..

  • l అడ్రస్‌ లేని కీలక నేతలు 
  • l నేతల మధ్య విభేదాలతో క్యాడర్‌లో అయోమయం 
  • l వేలాదిగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వైనం 
  • l నియోజకవర్గాల వారీగా క్యూ కడుతున్న శ్రేణులు 
  • l నిత్యం ప్రజలకు అందుబాటులో టీఆర్‌ఎస్‌ నేతలు 
  • l నిరంతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరికలకు మరో కారణం

కాంగ్రెస్‌ నేతలు తమకు అంతో ఇంతో పట్టున్న జిల్లాగా చెప్పుకునే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ  గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. అగ్రనేతలు అడ్రస్‌  పోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాంరాం చెబుతున్నారు. ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోతున్నారు. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలంతా నిత్యం ప్రజలను అంటిపెట్టుకుని ఉండడంతోపాటు అభివృద్ధి,  పథకాలతో ప్రజలతో మమేకం అవుతున్నారు. కానీ.. కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర రాజధానికే పరిమితం కావడంతోపాటు అంతర్గత విభేదాలతో ఒకరిపై  దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు  చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మంది చేరిపోగా.. మిగిలిన వాళ్లు ఆలోచనలో పడ్డారు.

- నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 


“తుంగతుర్తి నియోజకవర్గం..  నేతలదేమో ప్రజా సంక్షేమ కోణం. చరిత్రలో తొలిసారిగా వానకాలంలోనే బీడు భూములకు గోదావరి జలాలు పారించిన ఘనత. ప్రతి ఎకరాకు నీరు పారాల్సిందేనని కంకణం కట్టుకుని కాల్వల వెంట పరుగులు తీస్తున్న నేతలు. మరోవైపు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలన్న తాపత్రయం. కరోనా సమయంలోనూ ప్రజల వెన్నంటి ఉండి భరోసా కల్పిస్తున్న తీరు. కానీ.. కాంగ్రెస్‌ నేతల తీరు ఇందుకు పూర్తిగా భిన్నం. ఏనాడూ   పట్టించుకోలేదు.  అభివృద్ధిని స్వాగతించలేరు. కానీ.. పార్టీలో పట్టుకోసం మాత్రం నిత్యం సిగపట్లు... ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు..  కేసులు కూడా. కరోనా కాలంలోనూ ప్రజల వైపు తొంగిచూసే తీరిక లేదు.  పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు.ప్రజలను, క్యాడర్‌ను, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే వైపు ఆలోచిస్తారు. ఇప్పుడు తుంగతుర్తిలోనూ అదే జరుగుతుంది. కాంగ్రెస్‌ ఖాళీ అవుతుంది. జిల్లా అంతటా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.”   

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎంపీగా ఉన్న   పీసీసీ అధ్యక్షుడు... మరో ఎంపీ... ఓ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ఒక్కరేమిటీ చాలా మందే ఉన్నారు. వీరంతా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే అయినా... రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలోనూ ముఖ్యనేతలుగా చలామణి అవుతున్నారు. మేము లేకపోతే రాష్ట్రంలోనే కాంగ్రెస్‌ పార్టీ లేదన్నంతగా గొప్పలు పోతుంటారు. అలాంటి నేతలున్న ఉమ్మడినల్లగొండ జిల్లాలో ఆ పార్టీ క్యాడర్‌కు దిక్కులేని పరిస్థితి నెలకొంది. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్నకాస్త కాంగ్రెస్‌ పార్టీ క్రమక్రమంగా ఖాళీ అవుతోంది.
అందుకు తాజా చేరికలే నిదర్శనాలు. ఇంకా చాలామంది టీఆర్‌ఎస్‌లో చేరేందుకు క్యూలో ఉన్నారు. ఆ పార్టీకి ఏకైక ఎమ్మెల్యే ఉన్న మునుగోడు నియోజకవర్గంలో పెద్దఎత్తున కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ టీఆర్‌ఎస్‌లో చేరింది. ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి తమకు అందుబాటులో ఉండడం లేదని... సీనియర్లను, ముఖ్యమైన క్యాడర్‌ను విస్మరిస్తున్నారని... ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు ప్రస్తుత పరిస్థితికి పొంతన లేదని కాంగ్రెస్‌ పార్టీ క్యాడరే ఆరోపిస్తుంది. ఇక ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇక్కడికి చుట్టపుచూపుగానైనా రావడం లేదని విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలపై దాదాపు ఏడాదిన్నరగా ఓపికపట్టిన ద్వితీయశ్రేణి నేతలంతా ఇక లాభంలేదన్న అభిప్రాయానికి వచ్చారు. ఇకపోతే ఇదే సమయంలో ఇక్కడ టీఆర్‌ఎస్‌ నేతలు నిత్యం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గ్రామగ్రామాన ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. గతంలో ఎవ్వరూ ఊహించని పథకాలతో ప్రజల్లో మరింత ఆదరణ పొందుతున్నారు. దీంతోపాటు కరోనా సమయంలోనూ నేతలంతా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు అవుతున్నారు. ఇలాగే అభివృద్ధికి, ప్రజలకు దూరంగా కాంగ్రెస్‌లో ఉంటే తమ వ్యక్తిగత ప్రభావాన్ని కోల్పోతామని భావిస్తున్న నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ వైపు తొంగిచూస్తున్నారు. పార్టీలో చేరి అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని టీఆర్‌ఎస్‌ ముఖ్యులను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలోనే గత పక్షంరోజుల్లోనే పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల, గ్రామస్థాయి ముఖ్యనేతలు చాలామంది టీఆర్‌ఎస్‌లో చే
రారు. వీరితోపాటు ఇంకా చాలా మంది కాంగ్రెస్‌ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సహకారం, ప్రోత్సాహంతో చండూర్‌ జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ కర్నాటి వెంకటేశం, మర్రిగూడెం ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, గుండ్రపల్లి ఎంపీటీసీ పెందోటి వెంకటమ్మ, తేరటుపల్లి సర్పంచ్‌ వీరమళ్ల శ్రీశైలం, మాజీ సర్పంచులు కోడి గిరిబాబు, నామని జగన్నాథం, ఇంకా చాలామంది వార్డుమెంబర్లు, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు గ్రామశాఖల నుంచి క్యాడర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందర్నీ మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా వీరితోపాటు మరికొందరు సిద్ధమతున్నారు. ఇక తుంగుతుర్తి నియోజకవర్గంలో నాగారం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్‌ జడ్పీటీసీ సభ్యులు కడియం ఇందిరాపరమేష్‌, వర్ధమానుకోట ఎంపీటీసీ వడ్డే పరశురాములు మూడురోజుల కిందటే తమతో పాటు వందలాది మంది కాంగ్రెస్‌ క్యాడర్‌ను వెంటబెట్టుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ అంతంతమాత్రంగా ఉన్న పార్టీలో గ్రూపు తగాదాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, మరోనేత అద్దంకి దయాకర్‌ల మధ్య తీవ్రస్థాయిలో ప్రచ్చన్నయుద్ధం సాగుతోంది. ముఖ్య నేతలే ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటుంటే క్యాడర్‌కు దిక్కెవ్వరూ అన్న పరిస్థితి నెలకొంది. దీనికి తోడు టీఆర్‌ఎస్‌ అభివృద్ది సంక్షేమ పథకాలు కూడా ఆకర్షిస్తున్నాయి. పైగా ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన శ్రీరాంసాగర్‌ నీళ్లు చరిత్రలో తొలిసారి అక్కడి బీడు భూములను తడుపుతున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలంగా మారుతోంది. ఇంతకంటే అభివృద్ధి ఏముంటుందన్న ధోరణిలో కాంగ్రెస్‌ శ్రేణులు కనిపిస్తున్నాయి. దీంతో ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్‌ టీఆర్‌ఎస్‌ వైపు చూస్తోంది. రానున్నకాలంలో మరిన్ని చేరికలు పెద్దఎత్తున ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక నల్లగొండ నియోజవర్గంలోనూ కాంగ్రెస్‌ క్రమంగా ఖాళీ అవుతూ వస్తోంది. ఈనెల 23వ తేదీన కనగల్‌ మండలానికి చెందిన మెజార్టీ నేతలు కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. జి.యడవెల్లి, చిన్నమాదారం ఎంపీటీసీ సభ్యులు కర్నాటి పద్మజగన్‌, మల్లికంటి రాజు, ఉపసర్పంచ్‌ సైదులు, గ్రామశాఖ అధ్యక్షుడు నకిరేకంటి వెంకన్న
, ఇంకా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, క్యాడర్‌ గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఇక్కడ కూడా గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యాక క్యాడర్‌ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఒక్కసారిగా వచ్చిన ధాఖలాలు కూడా లేవు. క్యాడర్‌కు అందుబాటులో లేని అగ్రనేతల తీరుపై తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇక మరోవైపు ప్రభుత్వ పథకాలతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు గ్రామాల్లో మంచి ఉత్సాహాంతో ప్రజలతో ఉంటున్నారు. వీటన్నింటి పరిణామాల రిత్యా కాంగ్రెస్‌ క్యాడర్‌ ఆలోచనలో పడుతోంది. త్వరలో ఈ నియోజకవర్గంలోని ఇతర మండలాల నుంచి కూడా పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమచారం. 
నేతల అడ్రస్సేదీ...
కాంగ్రెస్‌ ఎంపీల్లో ఒకరైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేవలం కోదాడ, హుజూర్‌నగర్‌లకే పరిమితమవుతున్నారు. అది కూడా ఆడపాదడపా. మిగతా నియోజకవర్గాలతో తనకు సంబంధం లేదన్న ధోరణితో ఉంటాడని కాంగ్రెస్‌శ్రేణులే వ్యాఖ్యానిస్తుంటాయి. మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, అద్దంకి దయాకర్‌ లాంటి ముఖ్యులంతా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలేసారు. ఇక మిగతా నియోజకవర్గాల్లోనూ అక్కడక్కడ కనిపిస్తుంటారు. కీలక నేతలంతా హైదరాబాద్‌కు లేదంటే గాంధీభవన్‌ రాజకీయాలకే పరిమితం అవుతుండడంతో క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి, అయోమయం నెలకొంది. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ మంత్రి జగదీశ్‌ష్‌రెడ్డి, ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ క్యాడర్‌ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. దీంతో సహజంగానే కాంగ్రెస్‌, ఇతర విపక్ష కార్యకర్తలు ఆత్మపరిశీలనలో పడిపోతున్నారు. తమ నేతలకు, టీఆర్‌ఎస్‌ నేతలకు అసలు పొంతనే లేదన్న అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో పెద్దఎత్తున కాంగ్రెస్‌ను వీడుతున్నారు. అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.


logo