గురువారం 22 అక్టోబర్ 2020
Nalgonda - Aug 24, 2020 , 03:26:21

బీఆర్‌ఏఓయూలో అడ్మిషన్లు ప్రారంభం

బీఆర్‌ఏఓయూలో అడ్మిషన్లు ప్రారంభం

నల్లగొండ విద్యావిభాగం /బొడ్రాయిబజార్‌ : డా. బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ(యూజీ), పీజీ 2020-21 విద్యాసంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డా. జి.లక్ష్మారెడ్డి సూచించారు. ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బీఆర్‌ఏఓయూ పది అధ్యయన కేంద్రాల ప్రిన్సిపాల్స్‌, కోఆర్డినేటర్లు, అధ్యాపకులు జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడారు. ప్రతి సంవత్సరం అడ్మిషన్లలో రాష్ట్రంలోనే నల్లగొండ ప్రథమ స్థానంలో ఉంటుందని ఈ పర్యాయం కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.

అడ్మిషన్ల ప్రక్రియ ప్రభుత్వ, యూజీసీ నిబంధనల మే రకు కొవిడ్‌ -19 నిబంధనలతో కొనసాగుతుందన్నారు. ఉమ్మడి జిల్లా డీడీ డా. బి.ధర్మానాయక్‌ మాట్లాడుతూ 18సం. నిండి ఎలాంటి విద్యార్హత లేనివారికి యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించిందన్నారు. సెప్టెంబర్‌ 10వరకు అడ్మిషన్లకు అవకాశం ఉందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సూర్యాపేట నుంచి వెంకటేశ్వర కళాశాల ప్రిన్సిపా ల్‌ డాక్టర్‌ కె.రవీంద్రచారి, స్టడీసెంటర్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ వి.వెంకటేశ్‌  తదితరులు పాల్గొన్నారు. 


logo