గురువారం 29 అక్టోబర్ 2020
Nalgonda - Aug 24, 2020 , 02:31:22

ప్రైవేట్‌ దవాఖానలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

ప్రైవేట్‌ దవాఖానలు బాధ్యతాయుతంగా  వ్యవహరించాలి

  • నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌

నల్లగొండ క్రైం : కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్‌  వ్యాపార ధోరణితో కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన  చేశారు. జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలతో దవాఖానకు వస్తే సరైన పరీక్షలు నిర్వహించకుండానే కొవిడ్‌  బిల్లులు వేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో జిల్లా కేంద్రంలోని నవ్య దవాఖానను సీజ్‌ చేసినట్లు తెలిపారు.

కష్టకాలంలో వైద్యులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి రోగులకు సేవలందించాలని సూచించారు. తమ వద్దకు వచ్చే రోగులకు ఎంతో ఓపికతో సేవలందించే దవాఖానలు, వైద్యుల పట్ల ఉన్న గౌరవం మరింత పెరిగేలా ప్రజలకు అండగా నిలువాలని కోరారు. ప్రైవేట్‌ దవాఖానలపై నిఘా మరింత పెంచుతామని,  చార్జీలు వసూలు చేస్తూ రోగులను ఇబ్బందులు పెడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  దవాఖానలోనైనా టెస్టులు చేయకుండా.. సరైన చికిత్స, సౌకర్యాలు కల్పించకుండా ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ఎస్పీ సూచించారు.