గురువారం 22 అక్టోబర్ 2020
Nalgonda - Aug 19, 2020 , 03:30:34

తెలంగాణ తొలితరం ధీరుడు ‘సర్వాయి పాపన్న’

తెలంగాణ తొలితరం ధీరుడు ‘సర్వాయి పాపన్న’

నల్లగొండ కల్చరల్‌ : మొగల్‌ సామ్రాజ్యంపై యుద్ధం చేసి విజయం సాధించి గోల్కొండ కోటను పరిపాలించిన తెలంగాణ తొలితరం ధీరుడు సర్ధార్‌ సర్వాయి పాపన్న అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సర్ధార్‌ సర్వాయి పాపన్న 370వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్‌లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళుల్పరించి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానుభావుడని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేశ్‌గౌడ్‌, విశ్రాంత ఐఏఎస్‌ చొల్లేటి ప్రభాకర్‌, మల్లేశ్‌గౌడ్‌, నకిరేకంటి సైదులుగౌడ్‌, కొండూరు సత్యనారాయణ, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా బీసీ భనవలో బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు భిక్షంగౌడ్‌, తరాల పరమేశ్‌ పాల్గొన్నారు. గడియారం సెంటర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్‌గౌడ్‌ పాపన్నకు నివాళుల్పరించారు. 

పాపన్న పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం.. 

నల్లగొండ : తెలంగాణ ప్రజా యుద్ధ వీరుడు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్ధార్‌ సర్వాయి పాపన్న పోరాటస్ఫూర్తితో ముందుకు సాగుదామని గౌడ హాస్టల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుంకరి వెంకటేశ్వర్లుగౌడ్‌ అన్నారు. సర్వాయి పాపన్న జయంతిని తెలంగాణ గౌడ సంఘం, గౌడ హాస్టల్‌ కమిటీ, గౌడ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లగొండలోని గౌడ హాస్టల్‌లో ఘనంగా నిర్వహించారు.  నకిరేకంటి కాశయ్యగౌడ్‌,  జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొమ్మగాని రాంబాబు, రమేశ్‌గౌడ్‌, మారగోని నవీన్‌గౌడ్‌, చిట్ల వెంకటేశం, నాయకులు సత్తయ్యగౌడ్‌, సైదులుగౌడ్‌, శంకర్‌గౌడ్‌, గణేష్‌గౌడ్‌, యాదగిరిగౌడ్‌ పాల్గొన్నారు.


logo